క్రీడాభూమి

సెమీస్ చేరిన సమీర్ వర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బసెల్, ఫిబ్రవరి 24: స్విట్జర్లాండ్‌లోని బసెల్‌లో జరుగుతున్న స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్‌కు భారత్‌కు చెందిన షట్లర్, సయ్యద్ మోడి గ్రాండ్ ఫ్రిక్స్ గోల్డ్ చాంపియన్ సమీర్ వర్మ ప్రవేశించాడు. శనివారం ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సమీర్ 21-17, 21-16 స్కోరు తేడాతో జపాన్‌కు చెందిన కెన్టోమోమోటపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో అర్జున్, శ్లోక్ రామాచంద్రన్‌ల జోడీ 13-21, 18-21 స్కోరు తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన మానేపాంగ్ జోంగ్జిత్, నాన్త్‌కర్న్ యోర్డ్‌పాయిస్‌ల చేతిలో ఓటమి పాలయ్యారు. వియాన్నలో జరుగుతున్న ఆస్ట్రియా బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు హైదరాబాద్‌కు చెందిన పారుపల్లి కశ్యప్ దూసుకెళ్లాడు. వియన్నాలో శనివారం జరిగిన సెమీస్‌లో కశ్యప్ 21-17, 21-19 స్కోరు తేడాతో డెన్మార్క్‌కు చెందిన విక్టర్ స్వెండ్సన్‌పై గెలుపొందాడు.