క్రీడాభూమి

టీ-20 ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, ఫిబ్రవరి 24: ఇంటర్నేషనల్ టీ-20లలో మూడవది, ఆఖరి మ్యాచ్ సందర్భంగా న్యూలాండ్స్‌లోని కేప్‌టౌన్ మైదానంలో శనివారం జరిగిన ప్రతిష్ఠాత్మక పోరులో తొలుత టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థి భారత్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా విశ్రాంతి తీసుకోగా, అతని స్థానంలో దినేష్ కార్తీక్ జట్టులోకి తీసుకున్నారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. గత మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోని ఎడమచేతివాటం స్పిన్నర్ జయదేవ్ ఉనద్కత్‌ను తప్పించి, అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రాను తీసుకున్నారు. అదేవిధంగా గత మ్యాచ్‌లో ప్రత్యర్థికి నాలుగు ఓవర్లలో 64 పరుగులిచ్చి పరాభవాన్ని మూటగట్టుకున్న పేసర్ యుజ్వేంద్ర చాహల్‌ను కూడా తప్పించి అతని స్థానంలో అక్షర పటేల్‌ను తీసుకున్నారు. ఇక దక్షిణాఫ్రికా జట్టులో రెండు మార్పులు చేశారు. జేజే స్మట్స్, డేన్ పాటర్సన్ స్థానంలో క్రిస్టియన్ జోన్‌కర్, అరోన్ ఫంగిసోను తీసుకున్నారు. టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తమ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో రంగంలోకి దిగిన భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా మినగా మిగతా బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన స్కోరు చేయడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. సురేష్ రైనా 27 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఐదు బౌండరీల సహాయంతో 43 పరుగులు చేసి, శష్మి బౌలింగ్‌లో బెహర్డియన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. మనీష్ పాండే 10 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 13 పరుగులు చేసి డాలా బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. శిఖర్ ధావన్ 40 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 47 పరుగులు చేసి మంచి ఊపుమీదున్నాడని అనుకున్న తరుణంలో జూనియర్ డాలా చేతిలో రనౌట్ అయ్యాడు. కు సారధ్యం వహిస్తున్న రోహిత్ శర్మ ఆటతీరులో ఎలాంటి గొప్పదనం లేకుండా నిరాశపరిచాడు. రోహిత్ శర్మ ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో కేవలం 11 పరుగులు చేసి జూనియర్ దాలా చేతిలో ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన వికెట్ కీపర్ ఎం.ఎస్.్ధని ఫైనల్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ధోనీ 11 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 12 పరుగులు చేసి, జూనియర్ డాలా బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. హార్ధిక్ పాండ్య 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సహాయంతో 21 పరుగులు చేసి, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. దినేష్ కార్తీక్ ఆరు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతో 13 పరుగులు చేసి క్రిస్ మోరిస్ చేతిలో ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. అక్షర్ పటేల్ ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు, భువనేశ్వర్ కుమార్ ఒక బంతిని ఎదుర్కొని మూడు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
దక్షిణాఫ్రికా జట్టులో జూనియర్ డాలా నాలుగు ఓవర్లలో 35 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. క్రిస్ మోరిస్ నాలుగ ఓవర్లలో 43 పరుగులిచ్చి రెండు వికెట్లు, తబ్రీజ్ షంసి నాలుగు ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ప్రత్యర్థి జట్టు నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఆచితూచి ఆడింది. రీజా హెండ్రిక్స్ 13 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఏడు పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. డేవిడ్ మిల్లర్ 23 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు బౌండరీలతో 24 పరుగులు చేసి రైనా బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 10 బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసి హార్థిక్ పాండ్య బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చాడు.
స్కోరు బోర్డు
భారత్: ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు. (రోహిత్ శర్మ బి ఎల్‌బీడబ్ల్యు జూనియర్ డాలా 11, శిఖర్ ధావన్ రనౌట్ (జూనియర్ డాలా) 47, సురేష్ రైనా సి బెహర్డియన్ బి శంషి 43, మనీష్ పాండే సి మిల్లర్ బి జూనియర్ డాలా 13, హార్థిక్ పాండ్య సి మిల్లర్ బి జూనియర్ డాలా 21, ఎం.ఎస్.్ధని సి మిల్లర్ బి జూనియర్ డాలా 12, దినేష్ కార్తీక్ ఎల్‌బీడబ్ల్యు (క్రిస్ మోరిస్) 13).
దక్షిణాఫ్రికా: 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు. (రీజా హెండ్రిక్స్ సి ధావన్ బి భువనేశ్వర్ కుమార్ 7, డేవిడ్ మిల్లర్ సి అక్షర్ పటేల్ బి సురేష్ రైనా 24). హెన్రిచ్ క్లాసెన్ సి భువనేశ్వర్ కుమార్ బి హార్థిక్ పాండ్య 7).