క్రీడాభూమి

గార లలిత అద్భుత ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 24: జాతీయ జూనియర్, యూత్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి గార లలిత స్వర్ణపతకాన్ని సాధించి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. ఇక్కడి పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన జూనియర్ మహిళల 63 కిలోల క్యాటగిరీల లలిత స్నాచ్‌లో 83కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 104కిలోల మొత్తం 187కిలోల బరువును ఎత్తి మూడు స్వర్ణపతకాలను సొంతం చేసుకుంది. కాగా కర్ణాటకు చెందిన తసానాఛాను స్నాచ్‌లో 79కిలోలు క్లీన్ అండ్ జర్క్‌లో 103కిలోలతో మొత్తం 182కిలోల బరువును ఎత్తి రజక పతకం ప్రజాక్తఖాల్కర్ (మహారాష్ట్ర) మొత్తం 171 కిలోలతో కాంస్య పతకం గెలుచుకున్నారు.

చిత్రం..వెయిట్ లిఫ్ట్ చేస్తున్న గార లలిత