క్రీడాభూమి

ఆడుంటే మరో రికార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, ఫిబ్రవరి 24: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదు కావలసి ఉండగా వెన్నునొప్పితో బాధపడుతున్న ఆయన శనివారం జరిగిన టీ-20 ఆఖరి మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. ఇప్పటికే తన ఖాతాలో ఎన్నోఎనె్నన్నో రికార్డులను జమ చేసుకున్న ఈ పరుగుల యంత్రం దక్షిణాఫ్రికాతో శనివారం జరిగే టీ-20 ఇంటర్నేషనల్ ఆఖరి మ్యాచ్‌లో ఆడి, మరో 17 పరుగులు చేస్తే రెండు వేల పరుగులు (టీ-20) చేసిన ఘనతను సాధించేవాడే. దక్షిణాఫ్రికా టూర్‌లో ప్రపంచ కప్, ఆరు వనే్డలు, మూడు టీ-20 మ్యాచ్‌లకు భారత జట్టుకు సారధ్యం వహించిన కోహ్లీ రికార్డులను తిరగరాశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వనే్డలలో 5-1 తేడాతో ఘన విజయం సాధించి, విదేశీ గడ్డపై ఈ అరుదైన రికార్డును నమోదు చేసిన కెప్టెన్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఆడిన 57 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 1,983 పరుగులు చేశాడు. అయితే, ఇతని టీ-20 ఖాతాలో ఇప్పటివరకు ఎలాంటి సెంచరీలు నమోదు కాకపోయినా 18 అర్ధ సెంచరీలు ఉండడం గమనార్హం. టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఇప్పటివరకు ఇద్దరు క్రికెటర్లు మాత్రమే రెండు వేల పరుగులు సాధించారు. ఇప్పటివరకు మార్టిన్ గుప్తిల్ 75 టీ-20 మ్యాచ్‌లలో 2,271 పరుగులు, మెక్‌కల్లమ్ 71 మ్యాచ్‌లలో 2,140 పరుగులు చేశారు. అయితే, వీరిద్దరూ చేసిన రెండు వేల పరుగులలో రెండేసి సెంచరీలు ఉన్నా, అత్యధిక అర్ధ సెంచరీలు నమోదు చేసిన రికార్డు మాత్రం కోహ్లీకే దక్కుతుంది. శనివారం జరిగే టీ-20 మ్యాచ్‌లో కోహ్లీ ఆడి, మరో 17 పరుగులు చేస్తే రెండు వేల పరుగులు చేసిన మూడో వ్యక్తిగా వారిద్దరి సరసన చేరి రికార్డు పుటల్లోకి చోటుదక్కించుకునేవాడు.
స్ట్రైక్ రేటింగ్ విషయంలోనూ మార్టిన్ గుప్తిల్, మెక్‌కల్లమ్ కంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకే ఎక్కువ మార్కులు పడతాయి. కోహ్లీ స్ట్రైక్ రేట్ 137.32 కాగా, గుప్తిల్ 132.88, మెక్‌కల్లమ్ 136.21 స్ట్రైక్ రేట్‌తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో టీ-20 రెండో మ్యాచ్ వరకు కోహ్లీ 870 పరుగులు చేసి, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలబడ్డాడు.