క్రీడాభూమి

అమ్మాయిలు రికార్డు సృష్టించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, ఫిబ్రవరి 24: ప్రపంచ క్రికెట్‌లో మన అమ్మాయిలు రికార్డు సృష్టించారు. దక్షిణాఫ్రికాతో న్యూలాండ్స్‌లోని కేప్‌టౌన్‌లో శనివారం జరిగిన టీ-20 ఫైనల్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారధ్యంలోని జట్టు అఖండ విజయం నమోదు చేసింది. ఐదు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో (ఇందులో నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది) లో భారత్ 3-1 తేడాతో 54 పరుగుల ఆధిక్యంతో ప్రత్యర్థిని మట్టి కరిపించి కప్‌ను ఎగురవేసుకుపోయింది.
దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో నాలుగు టీ-20 సిరీస్ భారత్ వశమైంది. టీ-20 సిరీస్‌లో ఆసాంతం రాణించిన మిథాలీ రాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. టీమిండియాలో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మూడు సిక్సర్లు, ఎనిమిది బౌండరీలతో అలరించగా, ముంబయికి చెందిన యువ క్రికెటర్ జమీమా రోడ్రిగ్స్ రెండు సిక్సర్లు, మూడు బౌండరీల సహాయంతో 44 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం ఒక సిక్సర్, రెండు బౌండరీల సహాయంతో 27 పరుగులు చేసి చిరస్మరణీయ ఆటను ప్రదర్శించింది. టీమిండియా జట్టులో ముగ్గురు శిఖా పాండే, రుమేలీ ధర్, రాజేశ్వరి గైక్వాడ్ మూడు వికెట్లు వంతున తీసుకున్నారు.
తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన స్మృతి మంధాన 14 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 13 పరుగులు చేసి కేప్ బౌలింగ్‌లో మసాబతా క్లాస్‌కు క్యాచ్ ఇచ్చి తక్కువ స్కోరుకే నిరాశపరచి పెవిలియన్ దారిపట్టింది. ఆమెకు జోడీగా జట్టులోకి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సిక్సర్లు, బౌండరీలతో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. మిథాలీ రాజ్ 50 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, ఎనిమిది బౌండరీల సహాయంతో 62 పరుగులు చేసి ఇస్మాయిల్ బౌలింగ్‌లో లీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. అనంతరం బ్యాటింగ్‌లోకి దిగిన యువ సంచలనం జమీమా రోడ్రిగ్స్ 34 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మూడు బౌండరీల సహాయంతో అర్ధ సెంచరీకి చేరువలో 44 పరుగులు చేసి అయబోంగా హాకా బౌలింగ్‌లో ఆమెకే క్యౌచ్ ఇచ్చి పెవిలియన్ ముఖం పట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 17 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఒక బౌండరీ సహాయంతో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. వేదా కృష్ణమూర్తి ఆరు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీ సహాయంతో ఎనిమిది పరుగులు చేసి కేప్ చేతిలో రనౌట్ అయింది. దక్షిణాఫ్రికా జట్టులో మేరీజనే్న కేప్ నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి ఒక వికెట్, అబోంగా హాకా నాలుగు ఓవర్లలో 41 పరుగులిచ్చి ఒక వికెట్, షబ్నమ్ ఇస్మాయిల్ నాలుగు ఓవర్లలో 35 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం భారత్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో కేవలం 112 పరుగులు మాత్రమే చేసింది. ఈ జట్టులో బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన పెద్ద స్కోరు చేయలేదు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ డేన్ వాన్ నైకెర్క్ 12 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 10 పరుగులు చేసి, రుమేలీ ధర్ బౌలింగ్‌లో శిఖా పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. సునే లూస్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఐదు పరుగులు చేసి శిఖా పాండే చేతిలో బౌల్డ్ అయింది. వికెట్ కీపర్ లీజెల్లీ లీ 13 బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి రుమేలీ ధర్ బౌలింగ్‌లో పూనమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. మిగాన్ డు ప్రీజ్ 11 బంతులు ఎదుర్కొని 17 మూడు బౌండరీలతో 17 పరుగులు చేసి శిఖా పాండే బౌలింగ్‌లో మిథాలీ రాజ్‌కు క్యాచ్ ఇచ్చింది. నదైన్ డీ క్లెర్క్ మూడు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో నాలుగు పరుగులు చేసి శిఖా పాండే చేతిలో బౌల్డ్ అయింది. క్లో ట్రయన్ 17 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లతో 25 పరుగులు చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు క్యాచ్ ఇచ్చింది. షబ్నిమ్ ఇస్మాయిల్ 12 బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు చేసి పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో తానియా భాటియా చేతిలో స్టంప్ అవుట్ అయింది. మరిజనే్న కాప్ 21 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఒక బౌండరీ సహాయంతో 27 పరుగులు చేసి రుమేలీ ధర్ బౌలింగ్‌లో రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ ముఖం పట్టింది. అయబోంగా హాకా మూడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో స్మృతి మంధానకు క్యాచ్ ఇచ్చింది. మసాబటా క్లాస్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో తొమ్మిది పరుగులు చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో తానియా భాటియా చేతిలో స్టంప్ అవుట్ అయింది. రాయ్‌సిబీ తొజాకే నాటౌట్‌గా నిలిచింది. టీమిండియా జట్టులో శిఖా పాండే మూడు ఓవర్లలో 16 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకుంది. రుమేలీ ధర్ నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్ మూడు ఓవర్లలో 26 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకోగా, పూనమ్ యాదవ్ నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకుంది.
స్కోరు బోర్డు
భారత్: 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు. (మిథాలీ రాజ్ సి లీ బి ఇస్మాయిల్ 62, స్మృతి మంధాన సి మసాబతా బి కాప్ 13, జెమీమా రోడ్రిగ్స్ సి అండ్ బి అయబోంగా హాకా, హర్మన్‌ప్రీత్ కౌర్ నాటౌట్ 27, వేదా కృష్ణమూర్తి రనౌట్ (కాప్).
వికెట్ల పతనం: 1/32 (స్మృతి మంధాన), 130/2 (మిథాలీ రాజ్), 134/3 (జెమీమా రోడ్రిగ్స్), 166/4 (వేదా కృష్ణమూర్తి).
దక్షిణాఫ్రికా బౌలింగ్: మరిజానా కాప్ 4-1-22-1, అయబోంగా హాకా 4-0-41-1, షబ్నిమ్ ఇస్మాయిల్ 4-0-35-1, మసబాటా క్లాస్ 2-0-21-0, డేన్ వాన్ నికెర్క్ 4-0-22-0, రైసెబీ నొజాకే 2-0-21-0.
దక్షిణాఫ్రికా: 18 ఓవర్లలో 112 ఆలౌట్. లీజెలీ లీ సి పూనమ్ యాదవ్ బి రుమేలీ ధర్ 3, డేన్ వాన్ నైకెర్క్ సి శిఖా పాండే బి రుమేలీ ధర్ 10, సునే లూస్ బి శిఖా పాండే 5, మిగ్నాన్ డు ప్రీజ్ సి మిథాలీ రాజ్ బి శిఖా పాండే 17, క్లో ట్రయిన్ సి హర్మన్‌ప్రీత్ కౌర్ బి రాజేశ్వరి గైక్వాడ్ 25, నదీనే డిక్లర్క్ బి శిఖా పాండే 4, మరిజానే కాప్ సి రోడ్రిగ్స్ బి రుమేలీ ధర్ 27, షబ్నిమ్ ఇస్మాయిల్ స్టంప్ తానియా భాటియా బి పూనమ్ యాదవ్ 8, మసబతా క్లాస్ స్టంప్ తానియా భాటియా బి రాజేశ్వరి గైక్వాడ్ 9, అయబోంగా హాకా సి స్మృతి మంధాన బి రాజేశ్వరి గైక్వాడ్ 1, రాయిసిబీ తొజాకే నాటౌట్ 0.
వికెట్ల పతనం: 12/1 (డేన్ వాన్ నైకెర్క్), 18/2 (సునే లూస్), 20/3 (లిజెల్లే లీ), 40/4 (మిగ్నాన్ డుప్రిజ్), 44/5 (నదీనే డీక్లర్క్), 71/6 (క్లో ట్రయిన్), 100/7 (షబ్నిమ్ ఇస్మాయిల్), 108/8 (మరిజానే కాప్), 112/9 (అయబోంగా హాకా), 112/10 (మసబతా క్లాస్).
భారత్ బౌలింగ్: పూజా వస్త్రాకార్ 3-1-14-0, శిఖా పాండే 3-0-16-3, రుమేలీ ధర్ 4-0-26-3, పూనమ్ యాదవ్ 4-0-25-1, రాజేశ్వరి గైక్వాడ్ 3-0-26-3, హర్మన్‌ప్రీత్ కౌర్ 1-0-5-0.

చిత్రం..దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20లో గెలుపుతో విక్టరీ చూపుతున్న టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సేన