క్రీడాభూమి

జిమ్నాస్టిక్స్‌లో భారత్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఫిబ్రవరి 24: హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల జిమ్నాస్ట్ అరుణా బుద్ధారెడ్డి మెల్బోర్న్‌లో జరుగుతున్న 2018 ప్రపంచ జిమ్నాస్టిక్స్ ఫైనల్ పోటీ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఈ పోటీలో 13.649 స్కోరుతో ఈ ఘనత సాధించింది. స్లొవేనియా జిమ్నాస్ట్ జసా కైస్లెఫ్ 13.800 స్కోరుతో గోల్డ్ మెడల్ సాధించింది. ఆస్ట్రేలియా జిమ్నాస్ట్ ఎమిలీ వైట్‌హెడ్ 13.699 స్కోరుతో ఫైనల్‌లో కాంస్య పతకం అందుకుంది. భారత్‌కు చెందిన మరో జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ రెండో ప్రయత్నంలో 13.416 స్కోరు చేసింది. అరుణా బుద్ధారెడ్డి ఫైనల్స్‌లో మొదటి ప్రయత్నంలో 4.600 పాయింట్లు చేసి, అనంతరం 9,066 స్కోరుతో మొత్తం 13.666 స్కోరుతో కాంస్య పతకం అందుకుంది. అదేవిధంగా రెండో ప్రయత్నంలో 4,800 స్కోరుతో నిలిచిన ఆమె 7.833 స్కోరు జోడించి 13.633 పాయింట్లు సాధించింది. ఇదిలావుండగా, భారత్‌కు చెందిన జిమ్నాస్ట్ ఆశిష్ కుమార్ 2010లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
ఆ తర్వాత 2104లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో భారత్‌కు చెందిన మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ వాల్ట్ విభాగంలో కాంస్య పతకం సాధించి, భారత్ తరఫున ఆడిన జిమ్నాస్టిక్స్ పోటీల్లో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.
అదేవిధంగా 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన దీపా కర్మాకర్ 52 ఏళ్ల తర్వాత జిమ్నాస్టిక్స్‌లో ఈ ఘనత సాధించిన మహిళగా రికార్డు పుటల్లోకి ఎక్కింది. అయితే, దురదృష్టవశాత్తూ ఫైనల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఆమె కాంస్య పతకం అందుకోలేకపోయింది. కాగా, శనివారం జరిగిన ప్రపంచ కప్ పోటీలో 16 దేశాలకు చెందిన జిమ్నాస్ట్‌లు పాల్గొన్నారు.

చిత్రం..జిమ్నాస్టిక్స్‌లో కాంస్యం సాధించిన అరుణా బుద్ధారెడ్డి