క్రీడాభూమి

సైనా నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: సిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. సెమీ ఫైనల్‌లో మూడో సీడ్ లీ జురుయ్‌తో తలపడిన రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనా 20-22, 21-17, 19-21 తేడాతో ఓటమిపాలైంది. ఇటీవల కొంతకాలంగా కాలి మడమ గాయంతో బాధపడుతున్న సైనా ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఆమె ఆట స్పష్టం చేస్తున్నది. అయితే, ఆమె చివరి వరకూ పోరాటం సాగించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కాగా, టైటిల్ కోసం రచానొక్ ఇంతానన్‌తో జురుయ్ తలపడుతుంది. మరో సెమీ ఫైనల్‌లో ఇంతానన్ 21-8, 21-11 ఆధిక్యంతో బయే ఇయాంగ్ జూపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో విక్టర్ అక్సెల్సెన్, కెంటో మొమొతా ఫైనల్ చేరారు. అక్సెల్సెన్ 21-11, 21-11 స్కోరుతో సన్ వాన్ హూను ఓడించాడు. మరో సెమీ ఫైనల్‌లో మొమొతా మొదటి సెట్‌ను 17-21 తేడాతో చేజార్చుకున్నాడు. రెండో సెట్‌లో 3-6 తేడాతో వెనుకబడ్డాడు. అయితే, అ దేశలోనే ఫిట్నెస్ సమస్యతో పోటీ నుంచి వైదొలగడంతో మొమొతాకు ఫైనల్‌లో స్థానం దక్కింది.
బాగానే ఆడాను!
తాను బాగానే ఆడానని, అయతే, అంతకంటే మెరుగ్గా ఆడే అవకాశం తనకు ఉండిందని సైనా చెప్పింది. సెమీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జురుయ్‌పై తీవ్రంగానే పోరాడినట్టు చెప్పింది. అయతే, ఒకటిరెండు చిన్నపొరపాట్ల కారణంగా ఓటమి తప్పలేదని వాపోయంది. ఇంతకంటే మెరుగ్గా ఆడే సత్తా తనకు ఉందని చెప్పింది.