క్రీడాభూమి

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్‌కు మేం రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, ఫిబ్రవరి 25: దక్షిణాఫ్రికా టూర్‌లో టీమిండియా ఆడిన టెస్టు మ్యాచ్, ఆరు వనే్డలు, మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఒక టెస్టు మ్యాచ్ మినహా మిగతావాటిలో అఖండ విజయం నమోదు చేసుకున్నందున ఆదే ఊపుతో త్వరలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో నిర్వహించే పలు మ్యాచ్‌లలో ఆడేందుకు తామంతా అన్నివిధాల సిద్ధంగా ఉన్నామని పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ను 1-2 తేడాతో ఓడిపోయినా, ఆరు వనే్డలలో 5-1 తేడా, మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 2-1 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించలేదనే బాధ ఏమాత్రం లేదని, కానీ రెండు ప్రపంచ కప్ ట్రోఫీలను అందుకోవడం ఒక విధంగా గర్వకారణంగా ఫీలవుతున్నామని భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. టీ-20 మ్యాచ్‌లో టీమిండియాను విజయతీరాలకు చేర్చడంతో ప్రముఖ పాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్న భువీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్లలో జరిగే మ్యాచ్‌లలో సైతం మూడు ట్రోఫీలను కైవసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశాడు.ఇక తమ దక్షిణాఫ్రికా టూర్ విషయం గురించి ఆయన మాట్లాడుతూ ఈ కరేబియన్ గడ్డపై ఆతిధ్య జట్టును రెండు సిరీస్‌లలో ఓడించి గెలవడం అంటే సామాన్య విషయం కాదని అన్నాడు. టెస్టు సిరీస్‌ను కోల్పోయినా మిగిలిన వనే్డ సిరీస్, టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకోవడం తమలో మరింత ఆత్మవిశ్వాసం, నమ్మకం కలిగించిందని, ఇదే ఉత్సాహం, సడలని పట్టుదలతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్లలో మరింత బాగా ఆటతీరును ప్రదర్శించడం ద్వారా ముందుకు వెళ్తామని అన్నాడు.
ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ-20 మ్యాచ్‌లలో భిన్న ధృవాలను దృష్టిలో ఉంచుకుని తనదైన రీతిలో బాగా ఆడి జట్టుకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాననే భావిస్తున్నానని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్లు కలిగిన టీ-20 మ్యాచ్‌లో ఒక బౌలర్‌కు ఇచ్చిన నాలుగు ఓవర్లలో ఆచితూచి బౌలింగ్ చేయాల్సి ఉంటుందని, ఇందులో ప్రతి బంతి చాలా ముఖ్యమైనదేనని అన్నాడు. అదే టెస్టు మ్యాచ్‌లో అందుకు భిన్నంగా ఉంటుందని, అలాగే వనే్డ క్రికెట్‌లో యార్కర్లు, బంతులు నెమ్మదిగా వేయాల్సి ఉంటుందని అన్నాడు. క్రికెట్‌లో పవర్ ప్లే చాలా ముఖ్యమైనదని, ఇదే ఒక్కోసారి మ్యాచ్‌లో గెలుపు ఓటమిలను నిర్దేశిస్తుందని అన్నాడు. ‘బౌలింగ్ చేసేటపుడు నేను లీడర్ అని ఎన్నడూ అనుకోను. కానీ మా జట్టులో ఎవరు బౌలింగ్ చేసినా అతనిని లీడర్‌గానే భావిస్తా’ అని ఆయన అన్నాడు. ఈ విధమైన ఆలోచనా ధోరణి ఉన్నపుడే మ్యాచ్‌లలో విజయం సాధించగలమనే సూత్రాన్ని తాను నమ్ముతానని భువీ పేర్కొన్నాడు. ఇక కరేబియన్ ఆటగాళ్లలోని కొత్త ముఖాలు హెన్రిచ్ క్లాసెన్ వనే్డలలో రెండు మ్యాచ్‌లు అద్భుతంగా ఆడాడని, అదేవిధంగా మూడో టీ-20లో ఆ జట్టులోకి తీసుకున్న క్రిస్టియన్ జోన్‌కర్ కూడా మంచి ఆటతీరును ప్రదర్శించాడని ఆయన ప్రశంసించాడు. తొలి మ్యాచ్‌లో కొత్త బ్యాట్స్‌మెన్‌లకు బౌలింగ్ చేయాలంటే కొంత ఆలోచించాల్సిన అవసరం వస్తుందని, అయితే, క్రిస్టియన్ జోన్‌కర్‌తోపాటు హెన్రిచ్ క్లాసెన్‌ను తాము పెవిలియన్ దారిపట్టించామని ఆయన అన్నాడు.