క్రీడాభూమి

రైనా ఆటతీరుపై ప్రశంసల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, ఫిబ్రవరి 25: దాదాపు సంవత్సరం తర్వాత జట్టులోకి వచ్చి రాణించిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీలంకలో జరుగనున్న ముక్కోణపు టోర్నీలో చోటు దక్కాలంటే తప్పక ఆడాల్సిన మ్యాచ్‌లో రైనా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ టోర్నీలో బ్యాట్ ఝుళిపించాడు. సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాలన్న మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆటలో రాణించాడు. దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన చివరి టీ-20లో రైనా 27 బంతుల్లో ఐదు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడాడు. ఫలితంగా పేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. భారత్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రైనాపై ఇంటా బయట ప్రశంసలు కురుస్తున్నాయని అనడంలో సందేహం లేదు. రైనా పునరాగమనం అదిరిందని కైఫ్ ట్వీట్ చేయగా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న రైనాకు సచిన్ టెండూల్కర్ అభినందించాడు. ఇక పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అయితే రైనా.. బ్రహ్మాండగా ఆడావ్..అని ట్వీట్ చేశాడు. అందివచ్చిన ఆవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నావంటూ నెటిజన్లు సైతం రైనాపై ప్రశంసలు కురిపించారు. ఇక రైనా భార్య ప్రియాంక అయితే ‘నీ హృదయం నావోద్వేగంతో నిండిపోయి ఉంటుంది. నీ కళ్లల్లో ఆనంద భాష్పాలు వర్షించి ఉంటాయి’ అని ట్వీట్ చేసింది.
కోహ్లికి ప్రత్యేక కృతజ్ఞతలు: సురేశ్ రైనా
‘్భరత్ తరపున మళ్లీ అడాలన్న ఆకాంక్ష మరింత బలపడింది. 2019 వరల్డ్‌కప్‌లో అడాలనుకుంటున్నా, ఎందుకంటే ఇంగ్లాండ్‌లో బాగా ఆడతానని తెలుసు. నాలో ఇంకా ఎంతో సత్తా ఉంది’ అంటూ దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్‌కు బోర్డు నుంచి పిలుపురాగానే రైనా అన్న మాటలివి. అయితే మొదటి రెండు టీ-20లలో నామమాత్రపు పరుగులు చేసిన ఈ ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ తప్పక గెలవాల్సిన చివరి మ్యాచ్‌లో సరైన సమయంలో చెలరేగి ఆడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 1.3 ఓవర్లలోనే పెవిలియన్ దారి పట్టడంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన బాధ్యత రైనాపై పడింది. ఈ క్రమంలో ఓపెనర్ ధావన్‌తో కలిసి 43 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం పార్ట్‌టైమ్ స్పిన్నర్ అవతరామెత్తి ప్రమాదకర మిల్లర్‌ను 24 పరుగుల వద్ద బోల్తా కొట్టించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘గత రెండు సంవత్సరాలుగా నేను ఎంతో కష్టపడుతున్నా.. జాతీయ క్రికెట్ అకాడమీలో కఠోరంగా శ్రమించా, నా కెరీర్‌లో నేనెప్పుడూ ఫిట్‌గానే ఉన్నాను’ అని ఆయన ఉద్వేగభరితంగా సమాధానమిచ్చాడు. ‘ఖచ్చితంగా భారత్ తరపున ఆడతానని ఆశించాను. దాని కోసం ప్రతిక్షణం శ్రమిస్తూనే ఉండేవాడిని, భారత జెర్సీని ధరిస్తాను’ అని అంటూ తనను నిత్యం ప్రోత్సహించిన భార్య ప్రియాంకకు రైనా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
‘నా కోసం తన స్థానానే్న వదులుకున్నాడు’
మరోవైపు తనలోని సత్తాను ముందే గుర్తించిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా రైనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ‘జట్టులో ప్రతి ఒక్క ఆటగాడికి తగిన ప్రాధాన్యమిస్తున్నాడు. కానీ ఈ సిరీస్‌లో మాత్రం నా కోసం తన స్థానాన్ని త్యాగం చేశాడు’ అని అన్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి స్వేచ్ఛగా ఆడమని మొదటి నుంచి ప్రోత్సహించాడని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో బలహీనంగా ఉందని వనే్డ సిరీస్ ముగిసిన అనంతరం కోచ్ రవిశాస్ర్తీ అన్న సంగతి తెలి
సిందే. దీంతో ఇంతకుముందు మిడిల్ ఆర్డర్‌లో రాణించిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనావైపే సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపింది. ఇదే అదునుగా భావించి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవాలని ఉత్తరప్రదేశ్ బ్యాట్స్‌మెన్ తెలిపాడు. ఇక శ్రీలంకలో జరుగనున్న ముక్కోణపు సిరీస్‌పైనే తన దృష్టి అంటూ రైనా పేర్కొన్నాడు. అనంతరం ఐపీఎల్ ద్వారా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు అడి 2019 ప్రపంచ కప్‌లో తప్పకుండా స్థానం సంపాదించాలని ఆశిస్తున్న 31 ఏళ్ల రైనా తన క్రికెట్ కేరీర్‌లో టీమిండియా తరపున 223 వనే్డలు, 68 టీ-20లు ఆడాడు. వనే్డల్లో 4, 5 స్థానాలు తన బ్యాటింగ్ శైలికి అబ్బుతాయని రైనా చెప్పాడు.