క్రీడాభూమి

వనే్డ క్రికెట్‌కు ఇలియట్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఏప్రిల్ 2: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాలన్న పట్టుదలతో దక్షిణాఫ్రికా నుంచి న్యూజిలాండ్‌కు తరలి వెళ్లిన గ్రాంట్ ఇలియట్ వనే్డ ఇంటర్నేషనల్స్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే, టి-20 ఫార్మెట్‌లో కొనసాగనున్నట్టు ఈ న్యూజిలాండ్ క్రికెటర్ ప్రకటించాడు. 37 ఏళ్ల ఇలియట్ భారత్‌లో జరుగుతున్న టి-20 వరల్డ్ కప్‌లోనూ పాల్గొన్నాడు. అయితే, కివీస్ సెమీ ఫైనల్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. కాగా, గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్‌లో అజేయంగా 84 పరుగులు చేసిన ఇలియట్ తొలిసారి న్యూజిలాండ్‌ను ఈ మెగాటోర్నీ ఫైనల్‌కు చేర్చాడు. కెరీర్‌లో మొత్తం 83 వనే్డలు ఆడిన అతను 69 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. 1,976 పరుగులు సాధించాడు. 11 పర్యాయాలు నాటౌట్‌గా నిలిచాడు. 115 అతని అత్యధిక స్కోరు. అతని ఖాతాలో రెండు సెంచరీలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి. పార్ట్‌టైమ్ బౌలర్‌గానూ సేవలు అందిస్తున్న అతను వనే్డ ఫార్మెట్‌లో 1,302 బంతులు వేశాడు. 1,179 పరుగులిచ్చాడు. 39 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్టుగా ముద్ర పడిన అతను కెరీర్‌లో ఐదు టెస్టులు, 16 టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. వనే్డ ఇంటర్నేషనల్స్ ఫార్మెట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన అతను టి-20 ఫార్మెట్‌లో కొనసాగుతానని తెలిపాడు.