క్రీడాభూమి

కెప్టెన్సీకి అఫ్రిదీ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఏప్రిల్ 3: ఆసియా కప్, టి-20 వరల్డ్ కప్‌లో ఎదురైన పరాజయాలకు పాకిస్తాన్ కెప్టెన్ షహీద్ అఫ్రిదీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్టు అతను ప్రకటించాడు. అయితే, టి-20 ఫార్మెట్‌లో కెరీర్‌ను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. ఈరెండు టోర్నీలు జరుగుతున్న సమయంలో అఫ్రిదీ ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని, అతని నిర్లక్ష్యమే పరాజయాలకు కారణమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి సమర్పించిన నివేదికలో కోచ్, మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ఆరోపించిన విషయం తెలిసిందే. చాలా మంది ఆటగాళ్లు ఇదే రీతిలో వ్యవహరించారని, సపోర్టింగ్ స్ట్ఫా సలహాలు, సూచనలను వారు ఏమాత్రం పట్టించుకోలేదని వకార్ పేర్కొన్నాడు. అతను పాకిస్తాన్ చేరుకున్న వెంటనే అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. అధికారులు కోరితే కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని అన్నాడు. కాగా, భారత్ నుంచి బయలుదేరిన అఫ్రిదీ దుబాయ్ వెళ్లాడు. అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత స్వదేశానికి చేరాడు. అభిమానులకు అతను కూడా క్షమాపణ కోరాడు.
అయితే, అఫ్రిదీ క్షమాపణలతో అటు మీడియాగానీ, ఇటు మాజీ క్రికెటర్లుగానీ శాంతించలేదు. వారితోపాటు అభిమానుల నుంచి కూడా అఫ్రిదీకి విమర్శలు తప్పలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అతను కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు. అయితే, దీనితో తన కెరీర్ ముగిసినట్టు అనుకోవద్దని స్పష్టం చేశాడు. టి-20 ఇంటర్నేషనల్ ఫార్మెట్‌లో కొనసాగుతానని తెలిపాడు.