క్రీడాభూమి

మియామీ క్వీన్ అజరెన్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, ఏప్రిల్ 3: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌ను విక్టోరియా అజరెన్కా గెల్చుకుంది. ఫైనల్‌లో ఆమె స్వెత్లానా కుజ్నెత్సొవాను 6-3, 6-2 తేడాతో ఓడించింది. తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుందని అంతా ఊహించినప్పటికీ ఫైనల్ పోరు ఏకపక్షంగా కొనసాగింది. అజరెన్కా విజృంభణను కుజ్నెత్సొవా సమర్థంగా అడ్డుకోలేకపోయింది. 2009 నుంచి ఒక్క టైటిల్‌ను కూడా కైవసం చేసుకోలేకపోయిన కుజ్నెత్సొవా ఈసారి ఫైనల్ చేరడం ద్వారా తన ఖాతాలో మరో టైటిల్‌ను చేర్చుకునే అవకాశాలున్నాయని ఆశపడింది. కానీ, అజరెన్కా దూకుడును అడ్డుకోలేక రన్నరప్ ట్రోఫీతో సంతృప్తిపడింది.
అజరెన్కా మియామీ ఓపెన్‌ను గెల్చుకోవడం ఇది మూడోసారి. ఇంతకు ముందు ఆమె 2009, 2011 సంవత్సరాల్లో ఈ టైటిల్‌ను అందుకుంది. మూడు లేదా అంతకంటే ఎక్కువ పర్యాయాలు మియామీ టైటిల్ సాధించిన క్రీడాకారిణుల జాబితాలో స్థానం సంపాదించింది. స్ట్ఫె గ్రాఫ్ ఐదు, వీనస్ విలియమ్స్ మూడు, సెరెనా విలియమ్స్ ఎనిమిది పర్యాయాలు ఈ టైటిల్‌ను అందుకున్నారు. ఈ జాబితాలో నాలుగో క్రీడాకారిణిగా అజరెన్కా చేరింది. అంతేగాక, ఒకే ఏడాది ఇండియన్ వెల్స్, మియామీ ఓపెన్ టైటిళ్లు సాధించిన మూడో క్రీడాకారిణిగా కూడా అజరెన్కా రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకుంది. స్ట్ఫె గ్రాఫ్ 1994లో మొదటిసారి ఒకే ఏడాది ఈరెండు టైటిళ్లు సాధించింది. తిరిగి 1996లో అదే ఫీట్‌ను పునరావృతం చేసింది. కిమ్ క్లిజ్‌స్టర్స్ 2005లో ఇండియన్ వెల్స్, మియామీ ఓపెన్‌లో విజేతగా నిలవగా, ఇప్పుడు అజరెన్కా ఆ జాబితాలో చేరింది. అంతేగాక, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె ఎనిమిది నుంచి మూడు స్థానాలను మెరుగుపరచుకొని ఐదో స్థానానికి చేరింది.