క్రీడాభూమి

ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ ఇంతనాన్‌కు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: న్యూఢిల్లీలోని సిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను థాయిలాండ్ క్రీడాకారిణి రచానొక్ ఇంతనాన్ గెల్చుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె లీ జురుయ్‌ని 21-17, 21-18 తేడాతో ఓడించింది. జురుయ్ ఫేవరిట్‌గా ఫైనల్‌లో బరిలోకి దిగినప్పటికీ, ఇంతనాన్ ఆచితూచి ఆడుతూ, ఎక్కడా పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త పడుతూ విజయాన్ని నమోదు చేసింది. కాగా, పురుషుల సింగిల్స్ టైటిల్ ప్రపంచ రెండో సీడ్ కెన్టో మొమొతో గెల్చుకున్నాడు. అతను ఐదోసీడ్ విక్టర్ అక్సెల్సెన్‌ను 21-15, 21-18 తేడాతో ఓడించింది. మహిళ డబుల్స్ ఫైనల్‌లో అన్గా ప్రతమ, రికీ కరా సువర్దీ జోడీపై 21-17, 21-13 తేడాతో విజయం సాధించిన కెవిన్ సాజ్ సుకమల్జో, గిడియన్ మార్ ఫెర్నాల్డీ టైటిల్‌ను అందుకున్నారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను అయాకా తకహషి, మిసాకీ మత్సుతొమో తమ ఖాతాలో వేసుకున్నారు. ఫైనల్‌లో వీరు నవోకో ఫకామన్, కురుమీ యొనావో జోడీపై 21-18, 21-18 తేడాతో గెలుపొందారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో లు కయ్, హాంగ్ యక్వియాంగ్ 21-13, 21-16 స్కోరుతో రికీ విడిదంతో, పష్పితా రి దిలీ జోడీని ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నారు.