క్రీడాభూమి

బెనిటెజ్‌ను విమర్శించకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, డిసెంబర్ 9: కోచ్ రాఫెల్ బెనిటెజ్‌ను విమర్శించడాన్ని మానుకొని, అతనికి మద్దతునివ్వాలని రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అభిమానులకు పిలుపునిచ్చాడు. చాంపియన్స్ లీగ్‌లో భాగంగా మాల్మోతో జరిగిన మ్యాచ్‌ని రియల్ మాడ్రిడ్ 8-0 తేడాతో గెల్చుకుంది. ఈ టోర్నీలో అతి పెద్ద విజయంగా రికార్డును సమం చేసింది. రొనాల్డో నాలుగు గోల్స్ చేయగా, కరీం బెంజెమా మూడు గోల్స్ సాధించాడు. మార్టియో కవోసిక్ ఒక గోల్ చేశాడు. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో రొనాల్డో మొత్తం 11 గోల్స్ చేయడం విశేషం. ఒక సీజన్‌లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు అతని పేరిట ఉంది. 2013-14 సీజన్‌లో అతను ఏకంగా 17 గోల్స్ కొట్టాడు. అంతేగాక, ఆల్‌టైం లీడింగ్ గోలర్ కూడా అతనే. చాంపియన్స్ లీగ్‌లో అతను మొత్తం 84 గోల్స్ చేయగా, లియోనెల్ మెస్సీ 79, రాల్ 71 గోల్స్‌తో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇలావుంటే, గత నెల చిరకాల ప్రత్యర్థి బార్సిలోనాను సొంత గడ్డపై ఢీకొన్న రియల్ మాడ్రిడ్ 0-4 తేడాతో చిత్తయింది. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ కోచ్ బెనిటెజ్‌కు అభిమానుల నుంచి విమర్శలు తప్పడం లేదు. మాల్మోతో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో బృందం చెలరేగిపోగా, గోల్స్ వరద పారింది. అయితే, ఆ ఆనందాన్ని బెనిటెజ్ ఆస్వాదించలేకపోయాడు. అతను కనిపించిన ప్రతిసారీ అభిమానులు హేళన చేయడంతో ముఖం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, అభిమానులు సంయమనం పాటించాలని అన్నాడు. బెనిటెజ్‌ను గొప్ప కోచ్‌గా అభివర్ణించాడు. జట్టును విజయపథంలో నడిపించడానికి శక్తివంచన లేకుండా కృషి
చేస్తున్నాడని అన్నాడు. ఒక మ్యాచ్‌లోఓడినంత మాత్రాన బెనిటెజ్‌ను విమర్శించడం సరికాదని హితవు పలికాడు. రియల్ మాడ్రిడ్ అభిమానులంతా అతనికి మద్దతు పలకాలని కోరాడు.