క్రీడాభూమి

దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ రబడపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజబెత్, మార్చి 12: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుమ్యాచ్‌ల తొలి ఇన్నింగ్స్‌లో అతని వ్యవహార శైలి భిన్నంగా ఉండడంతో మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌లలో ఆడకుండా అతనిపై నిషేధం విధించారు. ఇక్కడి సెంట్ జార్జ్ పార్క్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా బౌలింగ్‌తో డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపిన సందర్భంగా రబడ వ్యవహార శైలిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అతనిని తప్పుపట్టింది. ఈ విషయమై రబడ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఎదుట హాజరై తన వాదనను వినిపించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించినందుకు ఇప్పటికే రబడపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. క్రికెటర్ ఎవరైనా ఒకసారి తప్పు చేస్తే అతని ఫీజులో 50 శాతం కోత విధించడంతోపాటు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లను కలుపుతారు. రెండుసార్లు ఇవే తప్పులు దొర్లితే మ్యాచ్ ఫీజును పూర్తిగా కోల్పోడమే కాకుండా అతని ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లు జమ అవుతాయి. రబడపై ఆరోపణలు రుజువు కావడంతో అతని ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు జమ చేయడంతోపాటు ఆస్ట్రేలియాతో జరిగే తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా అతనిపై నిషేధం విధించారు. మిగిలిన రెండు మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం ఉండదు.