క్రీడాభూమి

దక్షిణాఫ్రికాకు 139 పరుగుల ఆధిక్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజబెత్, మార్చి 12: ఆస్ట్రేలియాతో ఇక్కడి సెయింట్ జార్జ్ పార్క్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్‌లోనూ ప్రత్యర్థిని 79 ఓవర్లలో 239 పరుగులకే ఔట్ చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 22.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 71.3 ఓవర్లలో ఆస్ట్రేలియా 243 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 118.4 ఓవర్లలో 382 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ప్రత్యర్థిపై 139 పరుగుల ఆధిక్యతలో ఉంది.
ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా, కెమెరాన్ బాన్‌క్రాఫ్ట్ 70 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 24 పరుగులు చేసి ఎంగ్డి చేతిలో బౌల్డ్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ 21 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీతో 13 పరుగులు చేసి రబడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఉస్మాన్ ఖవాజా 136 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలతో 75 పరుగులు చేసి రబడ చేతిలో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 18 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక బౌండరీతో 11 పరుగులు చేసి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. సుహాన్ మార్ష్ ఐదు బంతులు ఎదుర్కొని ఒక పరుగులు చేసి రబడ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చాడు. మిచెల్ మార్ష్ 125 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, నాలుగు బౌండరీల సహాయంతో 45 పరుగులు చేసి రబడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పాట్ క్యూమిన్స్ 14 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఐదు పరుగులు చేసి రబడ బౌలింగ్‌లో ట్యూనిస్ డి బ్రూయిన్‌కు క్యాచ్ ఇచ్చాడు. మిచెల్ స్టార్ట్ 10 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి రబడ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. నాథన్ లియాన్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఐదు పరుగులు చేసి ఎంగ్డి బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చాడు. జోష్ హజ్‌లెవుడ్ 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు బౌండరీలతో 17 పరుగులు చేసి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఎంగ్డికి క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ టిమ్ పైనె 50 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఇక ఈ రెండో ఇన్నింగ్‌లో కగిసో రబడ 22 ఓవర్లలో 54 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. కేశవ్ మహారాజ్ 23 ఓవర్లలో 90 పరుగులిచ్చి రెండు వికెట్లు, లుంగిసాని ఎంగ్డి 13 ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు.
ఆ తర్వాత తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 22.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ఎయిడెన్ మర్‌క్రమ్ 28 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 21 పరుగులు చేసి హజ్‌లెవుడ్ బౌలింగ్‌లో స్వీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. డీన్ ఎల్గర్ 17 బంతుల ఎదుర్కొని ఐదు పరుగులు చేసి లియాన్ చేతిలో ఔటయ్యాడు. హషీం ఆమ్లా 42 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 27 పరుగులు చేసి పాట్ క్యూమిన్స్ బౌలింగ్‌లో పైనేకు క్యాచ్ ఇచ్చాడు.
ఏబీ డివిలియర్స్ 26 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, నాలుగు బౌండరీలతో 28 పరుగులు చేసి లియాన్ బౌలింగ్‌లో బాంక్రాఫ్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ 10 బంతులు ఎదుర్కొని రెండు పరుగులు, ట్యూనిస్ డి బ్రుయిన్ 14 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇక ఆస్ట్రేలియా జట్టులో నాథన్ లియాన్ తొమ్మిది ఓవర్లలో 44 పరుగులిచ్చి రెండు వికెట్లు, జోష్ హజ్‌లెవుడ్ ఆరు ఓవర్లలో 26 పరుగులిచ్చి ఒక వికెట్, పాట్ క్యూమిన్స్ 4.5 ఓవర్లలో 13 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.