క్రీడాభూమి

ఆసిస్ చేతిలో భారత్ పరాజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, మార్చి 12: భారత్‌తో ఇక్కడి రిలయన్స్ స్టేడియంలో సోమవారం జరిగిన ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ వనే్డ ఇంటర్నేషనల్ మూడు మ్యాచ్‌లలో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసిస్ జట్టులో ఓపెనర్ అజేయ సెంచరీతో భారత్‌ను 32.1 ఓవర్లలోనే కట్టడి చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత సేన నిర్ణీత 50 ఓవర్లలో 200 పరుగులు చేసింది. ప్రత్యర్థి విసిరిన లక్ష్యాన్ని మెగ్ లానింగ్ నాయకత్వంలోని ఆసిస్ సేన 32.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
భారత జట్టులో స్పృతి మంధాన 25 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 12 పరుగులు చేసి గార్డెనర్ బౌలింగ్‌లో లానింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. జమీమా రోడ్రిగ్స్ ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం ఒకే పరుగు చేసి అమందా వెల్లింగ్టన్ బౌలింగ్‌లో అలీస్సాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. పూనమ్ రౌత్ 50 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఆరు బౌండరీల సహాయంతో 37 పరుగులు చేసి అమందా వెల్లింగ్టన్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయింది. దీప్తి శర్మ 25 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక బౌండరీతో 18 పరుగులు చేసి జొనాసెన్ బౌలింగ్‌లో నికోలా కేరీకి క్యాచ్ ఇచ్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 29 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో తొమ్మిది పరుగులు చేసి స్కట్ బౌలింగ్‌లో అలీస్సా హీలేకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. వేదా కృష్ణమూర్తి 19 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 16 పరుగులు చేసి అమందా వెల్లింగ్టన్ బౌలింగ్‌లో బెత్ మూనేకి క్యాచ్ ఇచ్చింది.
శిఖా పాండే ఆరు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి జొనాసెన్ బౌలింగ్‌లో ఈ.పెర్రేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. వికెట్ కీపర్ సుష్మా వర్మ 71 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 41 పరుగులు చేసి జొనాసెన్ బౌలింగ్‌లో బోల్టన్‌కు క్యాచ్ ఇచ్చింది. పూజా వస్ట్రాకర్ 56 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఏడు బౌండరీలతో 51 పరుగులు చేసి జొనాసెన్ బౌలింగ్‌లో ఆర్.హేనెస్‌కు క్యాచ్ ఇచ్చి తిరుగుముఖం పట్టింది. పూనమ్ యాదవ్ 11 బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి రనౌట్ కాగా, రాజేశ్వరి గైక్వాడ్ నాటౌట్‌గా నిలిచింది. భారత టీమ్‌లో పూజా వస్త్రాకర్ ఒక్కరే అర్ధ సెంచరీ నమోదు చేయగా, వికెట్ కీపర్ సుష్మా వర్మ 41 పరుగులు, పూనమ్ రౌత్ 37 పరుగులు చేశారు. మిగిలినవారెవరూ ఆశించిన స్కోరును చేయలేకపోయారు. ఇదిలావుండగా ఆట చివరిలో బ్యాటింగ్‌కు దిగిన 18 ఏళ్ల పూజా వస్త్రాకర్ 71 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఏడు బౌండరీలతో 51 పరుగులు చేసి జట్టు కిష్టపరిస్థితుల్లో ఉన్నపుడు ఆదుకుని అందర్నీ ఆకట్టుకుంది.
ఇక ఆస్ట్రేలియా టీమ్‌లో జెస్సీ జొనాసెన్ 10 ఓవర్లలో 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లు, అమందా వెల్టింగ్టన్ ఆరు ఓవర్లలో 24 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు. మెగాన్ స్కట్ 10 ఓవర్లలో 37 పరుగులిచ్చి ఒక వికెట్, ఆష్‌లీగ్ గార్డనెర్ ఏడు ఓవర్లలో 34 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ బోల్టన్‌కు ప్రత్యర్థి తమ ముందు ఉంచిన లక్ష్యం ఏమంత కష్టసాధ్యం అనిపించలేదు. 18 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్‌ను మట్టికరిపించారు. ఈ జట్టులో వికెట్ కీపర్ అలీస్సా హేలీ 29 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఆరు బౌండరీల సహాయంతో 38 పరుగులు చేసి శిఖా పాండే బౌలింగ్‌లో వేదా కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టింది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్ 38 బంతులు ఎదుర్కొని ఐదు బౌండరీలతో 33 పరుగులు చేసి వేదా కృష్ణమూర్తి చేతిలో రనౌట్ అయింది. నికోల్ బోల్టన్ 101 బంతులు ఎదుర్కొని 12 బౌండరీలతో సెంచరీ నమోదు చేసి నాటౌట్‌గా నిలిచింది. అదేవిధంగా ఎలైస్ పెర్రీ 26 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో భారత్ చేతిలో ఓటమిపాలైన ఆసిస్‌కు ఇది మంచి శుభపరిణామని పలువురు వ్యాఖ్యానించారు. కాగా, ఈ రెండు జట్ల మధ్య రెండో వనే్డ గురువారం జరుగుతుంది.
సంక్షిప్త స్కోరు
భారత్: పూజా వస్త్రాకర్ బి జొనాసెన్ ఆర్ హేనెస్ 51, సుష్మా వర్మ బి జొనాసెన్ సి బోల్టన్ 41, పూనమ్ రౌత్ ఎల్‌బీడబ్ల్యూ అమందా వెల్లింగ్టన్ 37, దీప్తి శర్మ బి జొనాసెన్ సి నికొలా కారే 18, వేదా కృష్ణమూర్తి బి అమందా వెల్టింగ్టన్ సి బెత్ మూనే 16, స్మృతి మంధాన బి గార్డెనర్ సి లాన్నింగ్ 12, హర్మన్‌ప్రీత్ కౌర్ బి స్కట్ సి అలైస్సా హీలే 9, పూనమ్ యాదవ్ రనౌట్ 5, శిఖా పాండే బి జొనాసెన్ సి ఈ.పెర్రే 2, జమీమా రోడ్రిగ్స్ బి అమందా వెల్లింగ్టన్ సి అలైస్సా హీలే 1 (50 ఓవర్లలో 200/10).
ఆస్ట్రేలియా: నికోల్ బోల్టన్ నాటౌట్ 100, అలైస్సా హీలే బి శిఖాపాండే సి వేదా కృష్ణమూర్తి 38, మెగ్ లాన్నింగ్ రనౌట్ 33, ఎలైసే పెర్రీ నాటౌట్ 25 (32.1 ఓవర్లలో 202/2).

చిత్రం..భారత మహిళా జట్టుపై సెంచరీ సాధించిన ఆనందంలో
ఆస్ట్రేలియా క్రికెటర్ నికోల్ ఎలిజబెత్ బోల్టన్