క్రీడాభూమి

భారత యువ మహిళా క్రికెటర్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, మార్చి 12: ఆస్ట్రేలియాతో వనే్డ సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన వనే్డ మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు క్రికెటర్ పూజా వస్త్రాకర్ అరుదైన రికార్డును సాధించింది. వడోదర రిలయన్స్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వనే్డ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన పూజా 9వ డౌన్ లేదా అంతకంటే తక్కువ స్థాయిలో బ్యాటింగ్‌కి దిగి అర్ధ సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా రికార్డు సాధించింది. మ్యాచ్‌లో 56 బంతులు ఆడిన పూజా ఏడు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేసింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఆనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 32.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రం కోల్పోయి 202 పరుగులు చేసి విజయం సాధించింది.