క్రీడాభూమి

మియామీ ఓపెన్ టెన్నిస్ జొకొవిచ్‌కే టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, ఏప్రిల్ 4: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకొవిచ్ కైవసం చేసుకున్నాడు. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో జపాన్ క్రీడాకారుడు కెయ్ నిషికొరిని 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేశాడు. జొకొవిచ్ విజృంభణకు నిషికొరి నుంచి సరైన సమాధానం లేకపోయింది. మియామీలో అతను విజేతగా నిలవడం ఇది ఆరోసారి. కెరీర్‌లో 28వ ఎటిపి మాస్టర్స్ టైటిల్. చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ కంటే ఇప్పుడు అతను ఒక టైటిల్ ఆధిక్యంలో ఉన్నాడు. కాగా, ఈ విజయంతో 1.028 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీని జొకొవిచ్ స్వీకరించాడు. కెరీర్‌లో అత్యధిక ప్రైజ్‌మనీ పొందిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటి వరకూ నంబర్ వన్ స్థానంలో ఉన్న రోజర్ ఫెదరర్‌ను రెండో స్థానానికి నెట్టేశాడు. ఫెదరర్ కెరీర్ ఎర్నింగ్స్ 97,855,881 డాలర్లుకాగా, జొకొవిచ్ సంపాదన 98,199,548 డాలర్లకు చేరింది.
ప్రపంచ ర్యాంకింగ్స్‌తోపాటు ఆదాయంలోనూ నం బర్ వన్‌గా ఉన్న జొకొవిచ్ ఈఏడాది మరికొన్ని టోర్నీల్లో ఆడనున్న నేపథ్యంలో, అతని ప్రైజ్‌మనీ మరిం త పెరిగే అవకాశాలున్నాయ. మియామీ ఓపెన్‌లో దాదా పుగా ఎలాంటి తీవ్ర ప్రతిఘటనలు లేకుండానే అత ను టైటిల్‌ను కైవసం చేసుకోవడం విశేషం. జొకొవి చ్ ఫిట్నెస్ స్థాయని అతని ప్రస్థానమే స్పష్టం చేస్తు న్నది. ఇలావుంటే, ఈ టోర్నమెంట్ మహిళల డబు ల్స్ విభాగంలో బెతానీ మాటెక్ సాండ్స్ జోడీ టైటిల్ సాధించింది. వీరు ఫైనల్‌లో తిమియా బబోస్, యారొ స్లావ ష్వెడోవా జోడీని 6-3, 6-4 తేడాతో ఓడించారు. మ హిళల సింగిల్స్‌లో విక్టోరియా అజరెన్కా, పురుషుల డబు ల్స్‌లో పియరీ హ్యూస్ హెర్చర్బ్, నికోలాస్ మాహుత్ జో డీ టైటిళ్లను గెల్చుకున్న విషయం తెలిసిందే. అజరెన్కా ఫైనల్‌లో స్వెత్లానా కుజ్నెత్సొవాను ఓడించింది.