క్రీడాభూమి

కొత్త కోచ్ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ ఎవరు? ఈ ప్రశ్నకు ఒకటిరెండు రోజుల్లోనే సమాధానం లభిస్తుందని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వర్గాలు అంటున్నాయి. అండర్-19 జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు ఈ పదవి దక్కుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది వరకు కూడా ద్రవిడ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే, తాను జాతీయ జట్టుకు కోచ్‌గా బాధ్యతడలు స్వీకరించేందుకు సిద్ధంగా లేనని అప్పట్లో ద్రవిడ్ ప్రకటించాడు. ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌తో అప్పటి కోచ్ డంకన్ ఫ్లెచర్‌తో బిసిసిఐకి ఉన్న కాంట్రాక్టు ముగిసింది. ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి పలువురి పేర్లు వినిపించినప్పటికీ, అంతకు ముందే జట్టు కోసం కొత్తగా సృష్టించిన డైరెక్టర్ పదవిలో మరో మాజీ కెప్టెన్ రవి శాస్ర్తీని నియమించారు. అతనితోనే రోజులు నెట్టుకొస్తున్నారు. కోచ్‌గా రవి శాస్ర్తీ అదనపు బాధ్యతలను నిర్వహించాడు. కాగా, టి-20 వరల్డ్ కప్‌తో అతనితో కుదుర్చుకున్న ఒప్పందం కూడా పూర్తవుతుంది. దీనితో డైరెక్టర్ పదవిని కొనసాగించాలా? లేదా? కొత్త కోచ్‌ని తీసుకోకుండా రవి శాస్ర్తీకే రెండు బాధ్యతలు అప్పగించాలా? అన్న ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కోవడానికి బిసిసిఐ మల్లగుల్లాలు పడుతున్నది. వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఆడినప్పుడు ఫ్లెచర్ కోచ్‌గా కొనసాగినప్పటికీ, అతనిని పక్కకుపెట్టిన రవి శాస్ర్తీ అంతా తానై జట్టును నడిపించాడు. బిసిసిఐ కూడా అతనికి ఎదురుచెప్పలేదు. వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్ కూడా చేరకుండానే నిష్క్రమించడంతో బిసిసిఐపై విమర్శలు మొదలయ్యాయి. ఆతర్వాత జరిగిన వివిధ టోర్నీలు, సిరీస్‌లలోనూ భారత్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఆసియా కప్ టి-20 టోర్నీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్ టైటిల్ గెల్చుకున్నప్పటికీ, టి-20 వరల్డ్ కప్‌లో చేతులెత్తేసింది. సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఫలితాలతో టీమిండియాపై విమర్శలు చెలరేగుతున్నాయి. బిసిసిఐ అనుసరిస్తున్న విధానాన్ని కూడా చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. కోచ్‌ని నియమించకుండా, డైరెక్టర్ అనే పదవిని ఎందుకు సృష్టించారో? ఎందుకు రవి శాస్ర్తీకి విస్తృతాధికారాలు ఇచ్చారో అర్థం కావడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పుడు రవి శాస్ర్తీతో కాంట్రాక్టు ముగియడంతో కోచ్‌గా ఎవరిని నియమించాలనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. తన అపారమైన ప్రతిభాపాటవాలతో ఎన్నోసార్లు ఆదుకున్న ద్రవిడ్‌కే కోచ్ పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. క్రీజ్‌లో పాతుకుపోయి, వికెట్ల పతనాన్ని లెక్కలేనన్నిసార్లు అడ్డుకొని ‘ది వాల్’ అన్న పేరును సంపాదించుకున్న ద్రవిడ్ అన్ని విధాలా కోచ్ పదవికి అర్హుడు. అయితే, అతను సానుకూలంగా స్పందిస్తాడా లేదా అన్నది చూడాలి. ద్రవిడ్ రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉంటాడు. వివాదాల జోలికి వెళ్లడు. ప్రస్తుతం టీమిండియాలో ఆధిపత్య పోరు కొనసాగుతున్నదనేది బహిరంగ రహస్యం. ఈ పరిస్థితుల్లో కోచ్‌గా ఉండేందుకు ద్రవిడ్ అంగీకరించకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అండర్-19 జట్టుతోపాటు భారత్ ‘ఎ’కు కూడా కోచ్‌గా సేవలు అందిస్తున్న అతను ఈ పదవి కోసం ఇతరులతో పోటీపడేందుకు ఇష్టపడడం లేదు. గతంలో గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ పేర్లు వినిపించినా, వీరిద్దరితోపాటు సచిన్ తెండూల్కర్‌ను కూడా కలిపి, ముగ్గురితో సలహా కమిటీని బిసిసిఐ ఏర్పాటు చేసింది. కోచ్ పదవికి వారి పేర్లను పరిశీలించడం లేదని పరోక్షంగా స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీని కూడా బిసిసిఐ సంప్రదించిందని, కానీ, అతను నిరాకరించాడని సమాచారం. డైరెక్టర్‌గా రవి శాస్ర్తీ కాంట్రాక్టు ముగిసిన నేపథ్యంలో అతనికి అవకాశం ఇస్తారన్న వాదన వినిపిస్తున్నది. అయితే, కోచ్ కంటే డైరెక్టర్‌గా అతను ఎక్కువ అధికారాలను చెలాయించాడు. ఎక్కువ పారితోషికం కూడా తీసుకున్నాడు. అందుకే మరోసారి డైరెక్టర్ హోదాను కొనసాగిస్తూ, కోచ్‌గా అదనపు బాధ్యతలు ఇవ్వాలని రవి శాస్ర్తీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. కానీ, కోచ్ లేకుండానే జట్టును నడిపించడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్న కారణంగా రెండు పదవుల్లో బోర్డు అతనిని కొనసాగించకపోవచ్చు. మొత్తం మీద ఏ రకంగా చూసినా ద్రవిడ్‌నే కోచ్‌గా నియమించే అవకాశాలున్నాయి. అయితే, అతను ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తాడా అన్నదే ప్రశ్న. ద్రవిడ్ తన కెరీర్‌లో 164 టెస్టులు ఆడి 13,288 పరుగులు చేసిన ద్రవిడ్ 344 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 10,889 పరుగులు చేశాడు.