క్రీడాభూమి

మళ్లీ టీ-20లోకి జులన్ గోస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ క్రీడాకారిణి జులన్ గోస్వామి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగే టీ-20 ముక్కోణపు టోర్నీలో ఆడుతుంది. కొంతకాలం కిందట కాలి పాదం నొప్పితో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వడోదరలో జరుగుతున్న ఐసీసీ మహిళల వనే్డ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో చోటు దక్కించుకోలేపోయింది. ఇటీవల దక్షిణాఫ్రికా టూర్‌లో జరిగిన మూడో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌తోపాటు అదే జట్టుతో జరిగిన టీ-20 మ్యాచ్‌లలో సైతం ఆమె జట్టుకు దూరంగా ఉంది. అయితే, ఇపుడు ఆమె ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉండడంతో ఈనెల 22 నుండి 31 వరకు జరిగే ట్రైసిరీస్‌లో ఆడడం ఖాయమైంది. భారత జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. మిథాలీ రాజ్, వేదా కృష్ణమూర్తి, జెమీమా రోడ్రిగ్స్, అనుజా పాటిల్, దీప్తి శర్మ, తానియా భాటియా (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, ఏక్తా బిస్త్, జులన్ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, రుమేలీ ధర్, మోనా మెస్రమ్ జట్టులో సభ్యులుగా ఉంటారు. ఇదిలావుండగా, ఈనెల 22న భారత్-ఆస్ట్రేలియా, 23న ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్, 25న భారత్-ఇంగ్లాండ్, 26న భారత్-ఆస్ట్రేలియా, 28న ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ తలపడతాయి. మార్చి 31న ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ ముంబయి సీసీఐలో జరుగుతాయి. పోటీ పడుతుంది.