క్రీడాభూమి

ఆఫ్ స్పిన్నర్లు ఎవరికీ తీసిపోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 15: భారత జట్టులోని ఆఫ్ స్పిన్నర్లు ఎవరికీ తీసిపోరని, మణికట్టు స్పిన్నర్లతో సమానంగా వారు తమ మాయాజాలంతో అద్భుతాలు సృష్టించగలరని బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన టీ-20 మ్యాచ్‌లో మూడు ప్రధాన వికెట్లు పడగొట్టి కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురి ప్రశంసలు అందుకున్న తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో భాగంగా భారత్‌కు కీలకంగా భావించిన మ్యాచ్‌లో ఈ 18 ఏళ్ల సుందర్ 22 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు సాధించాడు.
ఈ ముక్కోణపు టోర్నీలో సుందర్ ఇప్పటివరకు ఏడు వికెట్లు తీసుకున్నాడు. ‘క్రికెట్‌లో బాగా రాణించాలంటే వచ్చిన అవకాశాలను ఒక చాలెంజ్‌గా తీసుకుని అందుకు తగినట్టుగా ఫలితం రాబడితేనే జట్టుకు, తద్వారా ఆ దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావచ్చును’ అని ఆయన వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో తన పరిధి మేరకు మంచి ఫలితాలు రాబట్టినందుకు తనకెంతో సంతృప్తిగా ఉందని ఆయన అన్నాడు. ‘చాలెంజ్‌ను ఒక సవాల్‌గా స్వీకరించి పోరాడినపుడు విజయం సాధించినపుడు వచ్చే ఆనందం చెప్పనలవి కాదు’ అని ఆయన పేర్కొన్నాడు. ‘నేను ఇప్పటికే చాలా లీగ్ మ్యాచ్‌లు ఆడాను. టోర్నమెంట్లు కూడా ఆడాను. ఆఫ్ స్పిన్ ఎలా వేయాలో బాగా తెలుసు. జట్టు కష్టసమయంలో ఉన్నపుడు వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసు’ అని ఆయన అన్నాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తమీమ్ ఇక్బాల్ (27), లిటోన్ దాస్ (7), సౌమ్యా సర్కార్ (1) వంటి కీలక వికెట్లను తీసి ఆ జట్టును వాషింగ్టన్ సుందర్ ఘోరంగా దెబ్బతీశాడు. తనతోపాటు యుజ్వేంద్ర చాహల్ కూడా నాలుగు కీలక ఓవర్లలో బాగా ఆడాడని ఆయన అన్నాడు. బంగ్లాదేశ్ క్రికెటర్లు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 215 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ వారిని ఎలా కట్టడి చేయాలో ప్రణాళికాపరంగా ముందుకు వెళ్లి అనుకున్న ఫలితం సాధించామని ఆయన పేర్కొన్నాడు. అన్ని ఫార్మాట్లలో ఆఫ్ స్పిన్నర్లు బాగా రాణిస్తున్నారన్న విషయం గడచిన కొనే్నళ్లనుండి గమనించవచ్చునని అంటూ ఆటలో మెలకువలు తెలుసుకుని గట్టి ప్రయత్నం చేస్తేఅనుకున్న ఫలితం దక్కుతుందనేది తన అభిప్రాయమని సుందర్ అన్నాడు.
శుక్రవారం బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుతో భారత్ ఆదివారం ఫైనల్‌లో తలపడుతుంది. తుదిపోరులో టీమిండియా తప్పకుండా టోర్నమెంట్‌లో విజయం సాధించి కప్‌ను అందుకుంటుందని ఆయన గట్టి నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేశాడు.