క్రీడాభూమి

ఏం మాయ చేశాడు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 15: బంగ్లాదేశ్‌తో బుధవారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన నిదహాస్ టీ-20 ముక్కోణపు టోర్నీలో తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టులోని మూడు ప్రధాన వికెట్లు పడగొట్టిన 18 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌పై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో సుందర్ 22 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లను పడగొట్టి ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 156 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 17 పరుగుల తేడాతో ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించి ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కు బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన కీలక మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకం కావడంతో హోరాహోరీ పోరులో చివరకి భారత్‌దే పైచేయి అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇరు జట్లలో అందరి కంటే ఎక్కువగా 61 బంతులు ఎదుర్కొని 89 పరుగులు చేసి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అవార్డు సాధించినా, తమ జట్టులోని ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఘనతను రోహిత్ వేనోళ్ల పొగిడాడు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ మాట్లాడుతూ కొత్త బంతితో బౌలింగ్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని, కానీ సుందర్ కొత్త బంతితో అద్భుతంగా రాణించాడని అన్నాడు.
సుందర్‌కు బౌలింగ్‌కు పంపించే ముందు తాను కొంత సంశయం వ్యక్తం చేశానని, కానీ తన అనుమానాలను పటాపంచలు చేస్తూ తన స్వంత వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడంలో సుందర్ కృతకృత్యుడయ్యాడని ప్రశంసించాడు. ‘్ఫల్డింగ్ ఎలా ఉండాలో సుందర్‌కు తెలుసు కాబట్టే అందుకు తగినట్టుగా అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. సుందర్‌తోపాటు జట్టులోని మిగతా బౌలర్లు కూడా తమ పరిధి మేరకు బౌలింగ్‌లో రాణించారని ఆయన అన్నాడు. కాగా, శ్రీలంక పిచ్‌పై అత్యధిక పరుగులు చేయడం అంత సులువు కాదని, మైదానంలో కాస్త నిలదొక్కుకున్న తర్వాత పరుగులు రాబట్టాలని అనుకుని అందుకు తగ్గట్టుగా వ్యవహరించానని ఆయన తెలిపాడు.
కొత్త బ్యాట్స్‌మన్‌లు ఈ పిచ్‌పై పరుగులు చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని, కానీ తనతోపాటు సురేష్ రైనా కూడా తన మాదిరిగానే నిలదొక్కుకుని 47 పరుగులు చేసి, జట్టును విజయపథంలో నిలబెట్టేందుకు తనదైన పాత్ర పోషించాడని ఆయన పేర్కొన్నాడు.