క్రీడాభూమి

క్రికెట్‌కు పీటర్సన్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం అతను పాకిస్తాన్ క్రికెట్ లీగ్ క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున లాహోర్‌లో ఆడుతున్నాడు.
ఇక తన పూర్తి సమయం కుటుంబానికే కేటాయిస్తానని ఆయన ప్రకటించాడు. ఇంగ్లాండ్ టీమ్‌లో అత్యంత ప్రతిభావంతుడైన, అరుదైన క్రికెటర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ 37 ఏళ్ల పీటర్సన్ పలు వివాదాల ద్వారా తరచూ వార్తల్లోకి ఎక్కాడు. పీటర్సన్ తన అంతర్జాతీయ క్రికెట్‌లో 104 టెస్టు మ్యాచ్‌లు, 136 వనే్డలు, 37 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో పీటర్సన్ సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్‌లో 30వేల పరుగులు చేశాడు.
68 సెంచరీలు, 152 అర్ధసెంచరీలు ఉన్నాయి. తన పేలవ ఆటతీరుతో ఫాం కోల్పోయిన అతనిని 2013-14లో జరిగిన యాషెష్ సిరీస్‌లో జట్టులోకి తీసుకోకపోవడంతో అతని కెరీర్ ఎన్నో మలుపులు తిరిగింది. అయితే, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక లీగ్ మ్యాచ్‌లలో అతను ఆడాడు.