క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపో (మలేసియా), ఏప్రిల్ 5: రియో డి జెనీరోలో ఈఏడాది ఆగస్టులో జరిగే ఒలింపిక్స్‌కు సన్నాహాలు చేస్తున్నామని, అందులో భాగంగానే అజ్లన్ షా, చాంపియన్స్ ట్రోఫీ పోటీలకు సిద్ధమవుతున్నామని భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ అన్నాడు. ఈనెల 16వ తేదీ వరకు జరిగే సుల్తాన్ అజ్లన్ షా టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్‌ని బుధవారం జపాన్‌తో భారత్ ఆడుతుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడడమే తమ వ్యూహమని విలేఖరులతో మాట్లాడుతూ సర్దార్ సింగ్ అన్నాడు. అజ్లన్ షాలో స్వర్ణ పతకం సాధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ టోర్నీ తర్వాత, జూన్ 10 నుంచి 17 వరకు లండన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఆడతామని చెప్పాడు. ఈ రెండు టోర్నీలను ఒలింపిక్స్‌కు సన్నాహకాలుగా చెప్పవచ్చని అన్నాడు. వీటిలో రాణించడం ద్వారా ఒలింపిక్స్‌లో గొప్పగా ఆడేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని సంపాదిస్తామని అన్నాడు. 1985, 1991, 1995, 2009, 2010 సంవత్సరాల్లో భారత్ అజ్లన్ షా టైటిల్‌ను కైవసం చేసుకుంది. గత ఏడాది మూడో స్థానంతో సంతృప్తి చెందింది. ఈ విషయాన్ని అతను ప్రస్తావిస్తూ, ఈసారి టైటిల్‌తో తిరిగిరాడమే తమ లక్ష్యమని అన్నాడు.
18 మంది సభ్యులతో భారత జట్టు
సర్దార్ సింగ్ నాయకత్వంలో 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టు అజ్లన్ షా హాకీ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నది. ఈ టోర్నీలో భారత్‌తోపాటు న్యూజిలాండ్, లండ్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఆస్ట్రేలియా, పాకిస్తాన్, జపాన్, కెనడా, మలేసియా జట్లు ఢీ కొంటాయి. భారత జట్టుకు సర్దార్ సింగ్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా, వైస్ కెప్టెన్‌గా సునీల్ బాధ్యతలు స్వీకరిస్తాడు. జట్టులోకి ఇద్దరు గోల్‌కీపర్లను సెలక్టర్లు తీసుకున్నారు. రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న నేపథ్యంలో, వివిధ కాంబినేషన్స్‌ను ప్రయత్నించేందుకు అజ్లన్ షా హాకీ టోర్నీని భారత సెలక్టర్లు ఒక వేదికగా భావిస్తున్నారు. అందుకే, ఒలింపిక్స్‌లోనూ ఆడే సత్తావున్న ఆటగాళ్లకు పెద్దపీట వేశారు.
జట్టు వివరాలు
గోల్‌కీపర్లు: హర్‌జోత్ సింగ్, ఆకాష్ అనిల్ చిక్తే.
డిఫెండర్లు: రూపీందర్ పాల్ సింగ్, జస్‌జిత్ సింగ్ కులార్, కొథాజిత్ సింగ్, సురేందర్ సింగ్, హర్‌మన్‌ప్రీత్ సింగ్.
మిడ్‌ఫీల్డర్లు: దనీష్ ముజ్‌తబా, చింగ్లెన్‌సనా సింగ్, మన్‌ప్రీత్ సింగ్, సర్దార్ సింగ్ (కెప్టెన్), ఎస్‌కె ఉతప్ప, హర్‌జీత్ సింగ్.
ఫార్వర్డ్స్: తల్వీందర్ సింగ్, మన్దీప్ సింగ్, ఎస్వీ సునీల్, రమణ్‌దీప్ సింగ్, నికిన్ తిమ్మయ్య.

అత్యంత ప్రతిష్ఠాత్మక అజ్లన్ షా హాకీ టోర్నమెంట్ 1998లో మొదలైంది. క్రమంగా మినీ ప్రపంచ కప్‌గా స్థిరపడింది. 2002లో ప్రపంచ హాకీ చాంపియన్‌షిప్ మలేసియాలో జరిగింది. అప్పట్లో సుల్తాన్ అజ్లన్ షా స్వయంగా వరల్డ్ కప్ నిర్వహణ కమిటీకి చీఫ్‌గా వ్యవహరించాడు. ఫలితంగా ఆ ఏడాది అజ్లన్ షా కప్ టోర్నీ జరగలేదు. ఆ ఒక్క సంవత్సరాన్ని మినహాయిస్తే, ప్రతి ఏటా లక్షలాది మంది అభిమానులను ఆకర్షిస్తున్న అజ్లన్ షా హాకీ ఈఏడాది సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకోనుంది.