క్రీడాభూమి

సింగిల్స్‌లో పూర్వ బారేకు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 18: ఇజ్రాయిల్‌లోని రిషోన్ లెజియన్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఇజ్రాయిల్ జూనియర్ 2018 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ (అండర్-19)లో భారత డిఫెండింగ్ చాంపియన్ పూర్వ బారే టైటిల్ దక్కించుకుంది. ముంబయిలోని నికిల్ కనేట్కర్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆమె నాలుగో సీడ్‌గా బరిలోకి దిగి మూడో సీడెడ్ క్రీడాకారిణి రష్యాకు చెందిన అనస్థేషియా పుస్తిన్‌ష్కయియాను 66 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 21-19, 10-21, 21-13 తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టైటిల్ దక్కించుకున్నందుకు తనకెంతో గర్వకారణంగా ఉందని ఆమె తెలిపింది. ఇప్పటికే ఇలాంటి రెండు టైటిళ్లను గెల్చుకున్న ఆమె ఇది ఈ ఏడాది సాధించిన తొలి విజయంగా అభివర్ణించింది. 2017లో ఇజ్రాయిల్ జూనియర్ చాంపియన్‌షిప్ గెల్చుకున్న ఆమె అదే ఏడాది ఇటాలియన్ జూనియర్ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెల్చుకుంది.