క్రీడాభూమి

సిక్సర్‌తో సిరీస్ వశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన నిదహాస్ ట్రోఫీ టీ-20 ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ విజేతగా నిలిచింది. భారత్-బంగ్లాదేశ్‌తోపాటు పోటీలకు ఆతిథ్యమిచ్చిన శ్రీలంక జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్‌తోపాటు బంగ్లాదేశ్ ఫైనల్ చేరుకున్నాయి. ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఆదివారం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ప్రత్యర్థిపై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో మొదటినుంచి మంచి ఊపుమీదున్న భారత్ ఫైనల్‌లో కూడా తన సత్తా చాటి ట్రోఫీని సొంతం చేసుకుంది.
*
కొలంబో, మార్చి 18: ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఆదివారం హోరాహోరీగా సాగిన నిదహాస్ ముక్కోణపు ట్రోఫీ టీ-20 సిరీస్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేయగా, అందుకు ప్రతిగా భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 56 పరుగులు చేసి జట్టును మంచి స్కోరు అందించాడు. ఉత్కంఠ పోరులో చెలరేగిన దినేష్ కార్తీక్ మ్యాచ్ ఆఖరిలో ఒక బంతి ఉండగా సిక్సర్ కొట్టి భారత్‌ను విజయపథాన నిలిపాడు. టాస్ గెలిచిన భారత జట్టు బంగ్లాదేశ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. బంగ్లా టీమ్‌లో షబ్బీర్ రహ్మాన్ (77) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన స్కోరు చేయలేకపోయారు. భారత జట్టులో స్పిన్ మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని హడలెత్తించాడు. అదేవిధంగా మరో బౌలర్ జయదేవ్ ఉనద్కత్ నాలుగు ఓవర్లలో 33 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.
టాస్ గెలిచిన భారత్ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి ఐదు ఓవర్లలోనే మూడు వికెట్లను కోల్పోయింది. లిటోన్ దాస్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 11 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. తమీమ్ ఇక్బాల్ 13 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 15 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఎస్.ఎన్.్ఠకూర్‌కు క్యాచ్ ఇచ్చాడు. సౌమ్యా సర్కార్ రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వికెట్ కీపర్ ముస్‌ఫికర్ రహీం 12 బంతులు ఎదుర్కొని తొమ్మిది పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. మహ్మదుల్లా 16 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 21 పరుగులు చేయగా, అతనిని విజయ్ శంకర్ బౌలింగ్‌లో దినేష్ కార్తీక్ రనౌట్ చేశాడు. కెప్టెన్ షాకీబ్ అల్ హసన్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఏడు పరుగులు చేసి విజయ్ శంకర్ బౌలింగ్‌లో రాహుల్ చేతిలో రనౌట్ అయ్యాడు. షబ్బీర్ రహ్మాన్ 50 బంతులు ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, ఏడు బౌండరీల సహాయంతో 77 పరుగులు చేసి ఉనద్కత్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. రూబెల్ హొస్సేన్ ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే జయదేవ్ ఉనద్కత్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. బంగ్లాదేశ్ టీమ్‌లో షబ్బీర్ రహ్మాన్ (77) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించి స్కోరు చేయలేకపోయారు. ఇక భారత జట్టులో యుజ్వేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనద్కత్ నాలుగు ఓవర్లలో 33 పరుగులిచ్చి రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రత్యర్థి జట్టు నిర్ధేశించిన 167 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా నాలుగు ఓవర్లలోపే శిఖర్ ధావన్, సురేష్ రైనా రూపంలో రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. శిఖర్ ధావన్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 10 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్‌లో ఏ.హక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. సురేష్ రైనా మూడు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే రూబెల్ బౌలింగ్‌లో రహీంకు క్యాచ్ ఇచ్చాడు. లోకేష్ రాహుల్ 14 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు బౌండరీలతో 24 పరుగులు చేసి రూబెల్ బౌలింగ్‌లో షబ్బీర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 42 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, నాలుగు బౌండరీల సహాయంతో 56 పరుగులు చేసి నజముల్ ఇస్లామీ బౌలింగ్‌లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. ఈ దశలో మనీష్ పాండే, విజయ్ శంకర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ బంగ్లాదేశ్ పటిష్టమైన బౌలింగ్ ముందు వీరు పరుగులు రాబట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో మనీష్ పాండే 27 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలో 28 పరుగులు చేసి ముస్త్ఫాజుల్ బౌలింగ్‌లో షబ్బీర్‌కు క్యాచ్ ఇచ్చాడు. విజయ్ శంకర్ 19 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 17 పరుగులు చేసి సౌమ్యా సర్కార్ బౌలింగ్‌లో మెహిదీ హసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. ఇక మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించిన ఘనత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కే దక్కుతుంది. ఎందుకంటే ఆఖరి ఓవర్‌లో ఒక బంతి మిగిలివుండగా, సిక్సర్ కొట్టి భారత జట్టుకు నిదహాస్ ట్రోఫీని దక్కించిన ఘనతను సాధించాడు. దినేష్ కార్తీక్ ఎనిమిది బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, రెండు బౌండరీల సహాయంతో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ పరుగులేమీ చేయకుండానే నాటౌట్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ జట్టులో రూబెల్ హొసేన్ నాలుగు ఓవర్లలో 35 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. షాకీబ్ అల్ హసన్ నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి ఒక వికెట్, నజముల్ ఇస్లామ్ నాలుగు ఓవర్లలో 32 పరుగులిచ్చి ఒక వికెట్, ముస్త్ఫాజుర్ రహ్మాన్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి ఒక వికెట్, సౌమ్యా సర్కార్ మూడు ఓవర్లలో 33 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
సంక్షిప్త స్కోర్లు:
బంగ్లాదేశ్: (20 ఓవర్లలో 166/8). తమీమ్ ఇక్బాల్ సి ఎస్.ఎన్.్ఠకూర్ బి యుజ్వేంద్ర చాహల్ 15, లిటోన్ దాస్ సి సురేష్ రైనా బి వాషింగ్టన్ సుందర్ 11, షబ్బీర్ రహ్మాన్ బి జయదేవ్ ఉనద్కత్ 77, సౌమ్యా సర్కార్ సి శిఖర్ ధావన్ బి యుజ్వేంద్ర చాహల్ 1, ముష్‌ఫికర్ రహీం సి విజయ్ శంకర్ బి యుజ్వేంద్ర చాహల్ 9, మహ్మదుల్లా రనౌట్ కార్తీక్/విజయ్ శంకర్ 21, షాకీబ్ అల్ హసన్ రనౌట్ రాహుల్/విజయ్ శంకర్ 7, రూబెల్ హొస్సేన్ బి జయదేవ్ ఉనద్కత్ 0, మెహిదీ హసన్ నాటౌట్ 19, ముస్త్ఫాజుర్ రహ్మాన్ నాటౌట్ 0. ఎక్స్‌ట్రాలు 6.
భారత్: (20 ఓవర్లలో 168/6). శిఖర్ ధావన్ సి ఏ.హక్ బి షాకీబ్ 10, రోహిత్ శర్మ సి మహ్మదుల్లా బి నజముల్ ఇస్లామ్ 56, సురేష్ రైనా సి రహీం బి రూబెల్ 0, లోకేష్ రాహుల్ సి షబ్బీర్ బి రూబెల్ 24, మనీష్ పాండే సి షబ్బీర్ బి మువస్త్ఫాజుర్ 28, విజయ్ శంకర్ సి మెహిదీ హసన్ బి సౌమ్యా సర్కార్ 17, దినేష్ కార్తీక్ 29 నాటౌట్, వాషింగ్టన్ సుందర్ 0 నాటౌట్. ఎక్స్‌ట్రాలు 4.
చిత్రం..చివరి ఒక బంతికి భారీ సిక్సర్ కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించిన దినేష్ కార్తీక్ ఆనందోత్సాహం