క్రీడాభూమి

దినేష్ కార్తీక్‌కు బిగ్ బీ క్షమాపణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: నిదహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. చేజారిపోయింది అని అనుకున్న మ్యాచ్‌ను టీం ఇండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ టీం ఇండియాను అభినందించబోయి చిన్న పొరపాటు చేశారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా తాను చేసిన తప్పిదానికి దినేశ్ కార్తీక్‌కు క్షమాపణ చెప్పాడు. టీం ఇండియా విజయాన్ని అభినందిస్తూ.. బిగ్ బీ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ రెండు ఓవర్లలో 24 పరుగులు అని పేర్కొన్నాడు. కానీ నిజానికి రెండు ఓవర్లలో చేయాల్సిన పరుగులు 34. దీనిని గమనించిన అమితాబ్ వెంటనే మరో ట్వీట్ ద్వారా తన పొరపాటును సరిదిద్దుకున్నాడు. గతంలోనూ భారత్-సౌతాఫ్రికాపై విజయం సాధిస్తే.. అమితాబ్ పొరపాటున ఆస్ట్రేలియాపై గెలిచినట్లు ట్వీట్ చేసి తప్పులో కాలేసిన విషయం తెలిసిందే.