క్రీడాభూమి

ఒలింపిక్స్‌లో బంగారు పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: సుశీల్ కుమార్...రెజ్లర్‌గా అతని పేరును ఎప్పుడో సుస్థిరం చేసుకున్నాడు. నేటి యువతలో చాలామంది రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారంటే అతని సత్తా ఏమిటో వారందరికీ తెలుసు. గత కొనే్నళ్లుగా పాల్గొన వివిధ పోటీల్లో ఎన్నో ఘనవిజయాలను అందుకున్న అతను త్వరలో జరుగబోయే కామనె్వల్త్ గేమ్స్‌పై దృష్టి సారించాడు. గత కామనె్వల్త్ గేమ్స్‌లో రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్‌గా నిలిచిన ఈ 34 ఏళ్ల రెజ్లర్ మూడోసారి ఒలింపిక్‌లో గోల్డ్ మెడల్ సాధించింది తన కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే అతని ఖాతాలో ఒలింపిక్ రజత, కాంస్య పతకాలు ఉన్నాయి. ‘రెజ్లింగ్‌ను ప్రారంభించిన తర్వాత ఆడే ఏ పోటీలోనైనా అద్భుత ప్రదర్శనతో మన దేశానికి పేరు తీసుకురావాలి..ఈ విషయంలో నేను వంద శాతం కృతకృత్యుడనయ్యాను. ప్రతిఒక్కరి మైండ్ సెట్ మార్చలేను’ అని ఆయన వ్యాఖ్యానించాడు. ‘నేను ఇప్పటికే రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించాను. మిగతా వారితో నన్ను పోల్చకండి’ అని ఆయన అన్నాడు. 2012 లండన్ గేమ్స్‌లో సిల్వర్ పతకం సాధించిన సుశీల్ కుమార్ తన ఖాతాలో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి దేశానికి అందించాలనే స్వప్నం చాలాకాలం నుండి ఉందని, దానిని నెరవేర్చుకునే దిశగా గట్టిగా కృషి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఆరోగ్యంపై మంచి శ్రద్ధ కనబరచే ఏ రెజ్లర్ అయినా అంతర్జాతీయ వేదికలపై 40 ఏళ్ల వరకు జరిగే వివిధ పోటీల్లో పాల్గొనే వీలుంటుందని, ఈ దిశగా తాను ఆరోగ్యం శ్రద్ధ వహిస్తూ గత నాలుగేళ్లుగా బాగా కష్టపడుతున్నానని ఆయన అన్నాడు. మోకాలి నొప్పి కారణంగా ఇటీవల జరిగిన ఆసియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో సుశీల్ కుమార్ ఆడలేకపోయాడు.