క్రీడాభూమి

మహిళా క్రికెట్ పటిష్ఠతకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: భారత మహిళా క్రికెట్ పటిష్ఠతకు ఉన్నతస్థాయిలో గట్టి చర్యలు చేపట్టనున్నారు. వడోదరలో ఇటీవల జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా ఘోరంగా ఓటమి చెందిన నేపథ్యంలో మహిళా టీమ్‌ను అన్ని విభాగాల్లో బలపరచేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మహిళా టీమ్ బలపడేందుకు అవసరమైన పేసర్లు, స్పిన్నర్లు, వికెట్ కీపర్లు వంటి వారి ఎంపిక కోసం త్వరలో జాతీయ క్రికెట్ అకాడమీలో ఒక శిబిరం నిర్వహించనున్నారు. జట్టులో లీడింగ్ పేసర్ జులన్ గోస్వామి అనారోగ్యం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ సిరీస్‌లో ఆడకపోవడం కూడా 0-3 తేడాతో భారత్ పరాజయం పాలవడానికి ఒక కారణంగా బీసీసీఐ భావిస్తోంది. అంటే వనే్డ సిరీస్‌లో జులన్ లేని లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సీఓఏ మెంబర్ డయానా ఈడుల్జీ, మిథాలీ రాజ్ (వనే్డ ఇంటర్నేషనల్ టీమ్ కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (టీ-20 కెప్టెన్), హేమలతా కళ (సెలక్షన్ కమిటీ చీఫ్), ప్రొఫెసర్ రత్నాకర్ షెట్టి (కన్వీనర్) ఈనెల 28న సమావేశం కానున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ సిరీస్‌లో భారత టీమ్ ఆటతీరు నిరాశపరచడంతో దీనిపై కూలంకుశంగా చర్చించేందుకు సమావేశం కానున్నారు. ‘మహిళా టీమ్‌లో తప్పనిసరిగా నాణ్యత కలిగిన ఉత్తమ పేస్ బౌలర్లు, స్పిన్నర్లు ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విషయం ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ సిరీస్‌లో మన వాళ్ల ప్రదర్శన చెప్పకనే చెప్పింది. మన స్పిన్నర్లను ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌లు ఎలా ఆడుకున్నారో, వారిని ఎదుర్కొనేందుకు మన స్పిన్నర్లు ఎంతటి అవస్థలు పడ్డారో గమనించాం. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ విభాగంలోనూ అద్భుత ఫాం కలిగినవారి ఆవశ్యకత ఎంతో ఉంది’ అని సీఓఏ మెంబర్ డయానా ఈడుల్జీ అభిప్రాయపడింది. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన డయానా ఇక్కడ పీటీఐతో మాట్లాడుతూ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వంటి పేరున్న క్రికెటర్ల నుంచి భవిష్యత్తులో మరింత మెరుగైన, నిలకడ కలిగిన ఆటతీరును తాము ఆశిస్తున్నామని ఆమె తెలిపింది. బీసీసీఐ కూడా దేశంలోని అన్ని ప్రాంతాల్లో మంచి టాలెంట్ కలిగిన క్రికెటర్ల కోసం వెతుకుతోందని ఆమె పేర్కొంది. అండర్-16 జట్టు ఎంపికలో పారదర్శకత పాటించి అన్నివిధాల సమర్థులైనవారిని ఆహ్వానించామని, వారిని సరైన విధంగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపింది. కానీ క్రికెట్‌లోని దాదాపు అన్ని విభాగాల్లో మంచి క్రీడాస్ఫూర్తి కలిగినవారి అవసరం ఎంతో ఉందని ఆమె తెలిపింది. ఇంగ్లాండ్‌లో గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత భారత మహిళా క్రికెట్ టీమ్‌కు మరింత ప్రాధాన్యత పెరిగిందని ఆమె పేర్కొంది. అయితే, కొనే్నళ్లపాటు క్రికెట్‌లో ఆడిన కొందరు మహిళా క్రికెటర్లు డబ్బు, పేరు ప్రతిష్ఠల కోసం పాకులాడుతూ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె విమర్శించింది. ‘మహిళా క్రికెటర్ల కోసం మేము ఎన్నో సౌకర్యాలు సమకూర్చాం...వాళ్లు నిలకడగా తమ ప్రతిభను ప్రదర్శించాలి. ఇలాంటి క్రీడాస్ఫూర్తి ఉంటేనే మహిళా క్రికెట్ కలకాలం బతికి బట్టకడుతుందని ఆమె వ్యాఖ్యానించింది. భారత మహిళా టీమ్ నిరంతరం అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడకపోవడం ప్రస్తుతం సమస్య కాదని, ఐసీసీ వనే్డ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ వంటి మ్యాచ్‌లలో ఆడేందుకు చాలా అవకాశాలు వస్తున్నాయని ఆమె తెలిపింది. కాగా, భారత మహిళా జట్టు గురువారం నుంచి ముంబయిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో జరిగే టీ-20 ముక్కోణపు సిరీస్‌లో ఆడనుందని, దీనిని ఒక చాలెంజ్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించింది.