క్రీడాభూమి

మళ్లీ పుంజుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 20: రానున్న రెండు, మూడేళ్లలో తాము మునుపటి ఫాం సాధిస్తామని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. ఇటీవల ఆస్ట్రేలియాతో వడోదరలో జరిగిన మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3తో కోల్పోయిన విషయమై ఆమె ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం తమ జట్టు పటిష్టంగా లేదని ఒప్పుకుంది. అయితే, ఇది ఇక ఎంతో కాలం సాగదని, రానున్న రోజుల్లో అన్ని విభాగాల్లో జట్టును పటిష్టవంతం చేసి, భవిష్యత్‌లో ఆడే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారత్ సత్తా చూపుతామని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ‘ప్రపంచ కప్ తర్వాత ఇపుడున్న భారత-ఏ టీమ్‌తో తమ టూర్‌ను గత ఏడాది ప్రారంభించినందున, ఈ జట్టు పుంజుకునేందుకు కొంత సమయం పడుతుందని స్పష్టం చేసింది. అంతర్జాతీయ వేదికల్లో జరిగిన మ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే మరిన్ని అవకాశాలు వస్తుంటాయని తెలిపింది. ‘తమ జట్టులో పలువురు యువ క్రికెటర్లను తీసుకున్నామని, వాళ్లు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తాము విశ్వసిస్తున్నామని పేర్కొంది. వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో భారత్-ఏ టీమ్‌లో చక్కని ప్రతిభ కలిగిన క్రికెటర్లను చూస్తారని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తాము స్వదేశంలో ఇటీవల జరిగిన మూడు వనే్డల సిరీస్‌ను జారవిడుచుకున్నామని, తమ జట్టు అన్ని విభాగాల్లోనూ ఆశించిన విధంగా రాణించలేదని ఆమె అంగీకరించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో దక్షిణాఫ్రికా గడ్డపై ఆ దేశ క్రికెట్ జట్టును ఓడించి రెండు సిరీస్‌లను తాము కైవసం చేసుకున్నామని, కానీ స్వదేశీ గడ్డపై విదేశీ జట్టు చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఈ రెండింటికీ సారూప్యం తగదని పేర్కొంది.
త్వరలో ముంబయిలో జరుగనున్న టీ-20 ముక్కోణపు సిరీస్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో భారత్ పోటీపడనుందని, ఆ రెండు జట్లలో చాలామంది కొత్తవాళ్లను తీసుకున్నారని పేర్కొంది.