క్రీడాభూమి

నాణ్యత లేని హెల్మెట్లపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, మార్చి 20: నాణ్యత లేని హెల్మెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ తెండూల్కర్ ఒక లేఖ రాశాడు. ‘నాణ్యతలేని మెటీరియల్‌తో హెల్మెట్లు తయారు చేసి వాటిపై ఐఎస్‌ఐ మార్కు వేస్తున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోండి. క్రికెటర్‌గా నాకు హెల్మెట్‌కు ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలుసు. మైదానంలోకి బ్యాటింగ్ చేసే సమయంలో మేము భద్రత కోసం నాణ్యమైన హెల్మెట్లు వాడతాం. అంతటి నాణ్యమైన హెల్మెట్లనే ద్విచక్రవాహనదారులు ధరించాలి. దేశంలో 70 శాతం మంది ద్విచక్రవాహన దారులు నకిలీ ఐఎస్‌ఐ మార్క్ హెల్మెట్లనే కొంటున్నారు. ఇలాంటి సమయంలో మనం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ఆయన అన్నాడు. గత ఏడాది జరిగిన రోడు ప్రమాదాల్లో 30 శాతం ద్విచక్రవాహనాల కారణంగానే జరిగాయని, . ఎంతోమంది చనిపోయారని, వారిలో హెల్మెట్లు ధరించినవారు ఉన్నారన్నాడు. హెల్మెట్ పెట్టుకున్న వారు ఎందుకు చనిపోయారంటే వారు ధరించిన హెల్మెట్ నాణ్యత కలిగినది కాదని, నాణ్యమైన హెల్మెట్ ధరించడం వల్ల తలకు గాయాలయ్యే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నాణ్యతలేని హెల్మెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో సచిన్ పేర్కొన్నాడు. గత ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు వచ్చిన సచిన్ కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనం నడుపుతున్న వారిని గమనించి హెల్మెట్‌లు తప్పకుండా ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అని కోరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా సచిన్.. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలని సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను సచిన్ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.