క్రీడాభూమి

టాప్ ఈవెంట్స్‌లో స్వర్ణాలే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: కామనె్వల్త్ గేమ్స్, ఆసియా క్రీడలతోపాటు 2020 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను సాధించడమే తన లక్ష్యమని భారత స్టార్ రెజ్లర్, 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ స్పష్టం చేసింది. వచ్చేనెల నాలుగో తేదీ నుంచి ఆస్ట్రేలియాలోని గోల్ కోస్ట్‌లో ప్రారంభం కానున్న కామనె్వల్త్ గేమ్స్ కోసం సిద్ధమవుతున్న సాక్షి బుధవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రియోలో పతకం గెల్చుకున్న తర్వాత, రాబోయే మూడు మేజర్ ఈవెంట్స్‌లో పతకాలు సాధించాలన్న లక్ష్యంతోనే కృషి చేస్తున్నానని తెలిపింది. ఇక్కడి భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రంలో శిక్షణ పొందుతున్న తాను ఎక్కువగా టెక్నిక్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నానని తెలిపింది. రెజ్లింగ్‌లో బలమైన పట్టుకు ఎంతో ప్రాధాన్యం ఉందని, అందుకే, ఆ దిశగానే తన శిక్షణ కొనసాగుతున్నదని చెప్పింది. ఎంపిక చేసుకున్న రంగాల్లో పరిపూర్ణతను సాధించడానికి కృషి చేస్తే, విజయాలు వాటంతట అవే వరిస్తాయని వ్యాఖ్యానించింది.
కామనె్వల్త్ గేమ్స్, ఆసియా క్రీడలకు తన శిక్షణ అద్భుతంగా కొనసాగుతున్నదని గత ఏడాది మార్చిలో కిర్గిస్తాన్‌లోని బిష్కెక్‌లో జరిగిన ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన సాక్షి తెలిపింది. ఆ ఉత్సాహంతోనే కామనె్వల్త్, ఆసియా క్రీడలేకాకుండా, రాబోయే టోక్యో ఒలింపిక్స్‌లోనూ స్వర్ణ పతకాన్ని సాధించాలన్న పట్టుదలతో తాను శ్రమిస్తున్నానని చెప్పింది. రియో ఒలింపిక్స్‌లో భారత బృందం వైఫల్యాల బాటలో నడుస్తుంటే, తొలి పతకాన్ని సాక్షి అందించిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ, ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్న క్షణంలో తాను పొందిన ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేయలేనని అన్నది. భగవంతుడి కృపతోనే తాను ఆ పతకాన్ని సాధించగలిగానని వ్యాఖ్యానించింది. గ్లాస్గోలో జరిగిన 2014 కామనె్వల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించడాన్ని ప్రస్తావించగా, ఈ పోటీల్లో ఎప్పుడూ నైజీరియా, కెనడా రెజ్లర్ల నుంచే గట్టిపోటీ ఉంటుందని తెలిపింది. తనకు ఎదురవుతారని భావిస్తున్న రెజ్లర్లు గంతకు ముందు పాల్గొన్న బౌట్ల వీడియో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని, ప్రత్యర్థుల వ్యూహాలను, వారి బలాబలాలను తెలుసుకోవడానికి ఇది అత్యవసరమని చెప్పింది. విదేశీ కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ పొందడం వల్ల కొత్తకొత్త విషయాలు నేర్చుకోగలుగుతామని తెలిపింది. దేశానికి అత్యుత్తమ సేవలు అందించడమే తన లక్ష్యమని, పాల్గొన్న ప్రతి పోటీలోనూ విజయాల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పింది.