క్రీడాభూమి

షమీకి క్లీన్‌చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) క్లీన్‌చిట్ ఇచ్చింది. షమీ ఒక పాకిస్తాన్ యువతితో కలిసి ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆతని భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌కు చెందిన అలిష్బా అనే యువతితో కలిసి మహమ్మద్ భాయ్ అనే బుకీ నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ కోసం షమీ భారీగా సొమ్ము తీసుకున్నాడని ఆమె ఆరోపించింది. గృహ సింహ, మోసం వంటి ఆరోపణలతోపాటు ఆమె ఫిక్సింగ్ ఆరోపణలను కూడా సంధించడంతో భారత క్రికెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయాన్ని బీసీసీఐ పాలనాధికారుల బృందం (ఏసీయు) కూడా తీవ్రంగా పరిగణించి, విచారణకు ఆదేశించింది. బోర్డు ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక విభాగం (ఏసీయు) చీఫ్ నీరజ్ కుమార్ నేతృత్వంలో విచారణ జరిపించింది. పూర్వాపరాలను విచారించిన తర్వాత నీరజ్ కుమార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా, షమీకి బీసీసీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. అంతేగాక, గ్రేడ్ 3బి2 కాంట్రాక్టును కూడా ఇస్తున్నట్టు ప్రకటించింది. వచ్చేనెల 7వ తేదీ నుంచి మొదలయ్యే ఐపీఎల్‌లో అతను ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. మొత్తం మీద క్లీన్‌చిట్ దక్కడంతో షమీకి ఊరట లభించింది. అయితే, అతనిపై హసీనా చేసిన ఆరోపణలపై కోర్టులో కేసు కొనసాగుతునే ఉంది.