క్రీడాభూమి

మందానా పోరాటం వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొని, 0-3 తేడాతో పరాజయాన్ని చవిచూసిన భారత మహిళల జట్టు టీ-20 ఫార్మాట్‌లోనూ పుంజుకోలేదని స్పష్టమైంది. ముక్కోణపు టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌ను ఢీకొన్న భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. స్మృతి మందానా అర్ధ శతకంతో రాణించినప్పటికీ, ఆమె శ్రమ వృథా అయింది. భారత్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. మందానా (41 బంతుల్లో 67 పరుగులు)తోపాటు అనుజా పాటిల్ (21 బంతుల్లో 35 పరుగులు) మాత్రమే ఆసీస్ బౌలింగ్‌ను కొంత వరకైనా సమర్థంగా ఎదుర్కోగలిగింది. మిగతా వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత మహిళలు తమ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది.
ఇంగ్లాండ్ కూడా పోటీపడుతున్న ఈ టోర్నమెంట్‌లో శుభారంభం చేయడానికి 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలోనే గమ్యాన్ని చేరింది. బెత్ మూనీ 32 బంతుల్లో 45, కెప్టెన్ మెగ్ లానింగ్ 25 బంతుల్లో 35, ఎలిస్ విలానీ 33 బంతుల్లో 39 చొప్పున పరుగులు చేశారు. అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రతిభ కనబరచిన ఆస్ట్రేలియా సులభంగానే నెగ్గింది. వనే్డ సిరీస్‌లో వైఫల్యాల నుంచి బయటపడలేకపోయిన భారత్ తొలి మ్యాచ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 (స్మృతి మందానా 67, అనుజా పాటిల్ 35).
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 156 (బెత్ మూనీ 45, మెగ్ లానింగ్ 35, ఎలిస్ విలానీ 39).