క్రీడాభూమి

‘బయో’ పరీక్షకు ధావన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 9: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని, అతను 14 రోజుల్లోగా బయోమెట్రిక్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో ఢిల్లీలో జరిగిన చివరి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు ఓవర్లు వేసిన ధావన్ తొమ్మిది పరుగులిచ్చాడు. అతనికి వికెట్ లభించలేదు. కాగా, బంతులు వేస్తున్నప్పుడు అతని చేతి వంపు అనుమతించిన 30 డిగ్రీల కంటే ఎక్కువగా ఉందని మ్యాచ్ రిఫరీ చేసిన ఫిర్యాదుపై ఐసిసి స్పందించి, అతనిని బయోమెట్రిక్ పరీక్షకు హాజరుకావాలని ఆదేశించింది. ఆ పరీక్ష నివేదిక అందే వరకూ అతను అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ వేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.
నష్టం లేదు
ధావన్ బౌలింగ్ చేయడం, అతని యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని ఐసిసి ప్రకటించడం భారత క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. అతను కనీసం పార్ట్‌టైమ్ బౌలర్ కూడా కాకపోవడమే అందుకు కారణం. కెరీర్‌లో ఇప్పటి వరకూ 19 టెస్టులు ఆడిన అతను కేవలం ఐదు మ్యాచ్‌ల్లో, తొమ్మిది ఓవర్లు బౌల్ చేశాడు. 18 పరుగులిచ్చాడు. వికెట్‌ను సాధించలేకపోయాడు. 69 వనే్డలతోపాటు ఎనిమిది టి-20 మ్యాచ్‌లు కూడా ధావన్ ఆడాడు. అయితే, ఈ రెండు ఫార్మెట్స్‌లోనూ అతను బౌలింగ్ చేయలేదు. సరదాగా అప్పుడప్పుడు బంతులు వేయించడం తప్ప, అతనిని పార్ట్‌టైమ్ బౌలర్‌గా ఉపయోగించుకునే అవసరం టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకిగానీ, టి-20, వనే్డ ఫార్మెట్స్‌లో నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీకిగానీ లేదు. కాబట్టి అతనిని బౌలింగ్‌ను పూర్తిగా నిషేధించినా భారత జట్టుకు వచ్చే నష్టమేమీ లేదు.