క్రీడాభూమి

భారత్‌కు అగ్ని పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 24: ఇక్కడ జరుగుతున్న మహిళల క్రికెట్ టీ-20 ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు చేతిలో పరాభవం పాలైన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అగ్ని పరీక్షను ఎదుర్కోనుంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించడంతో ఈ జట్టును ఢీకొనాలంటే భారత్ అన్ని విభాగాల్లోనూ మరింత పటిష్టవంతంగా తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. గత మ్యాచ్‌ను పరిశీలిస్తే టీమిండియా జట్టులో లోయర్ మిడిలార్డర్ వైఫల్యం చెప్పకనే చెప్పింది. జట్టులో వేదా కృష్ణమూర్తి, హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ వంటి పరిణితి చెందిన క్రికెటర్లు సమర్థవంతమైన పాత్రను పోషిస్తున్నారు. మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులో ఎక్కువ సేపు నిలబడగలిగితే పటిష్టవంతమైన ఇంగ్లాండ్‌ను ఎదుర్కోగలరు. ముంబయి క్రికెటర్ జమీమా రోడ్రిగ్స్ తన బ్యాట్‌కు పదును చెబితే జట్టు స్కోరు పెరుగుతుంది. ఎడమచేతివాటం బ్యాట్స్‌విమన్, వైస్‌కెప్టెన్ స్మృతి మందాన తన ఆటతీరుతో కోచ్ తుషార్ ఆర్థోను సంతృప్తిపరచగలిగినా గత మ్యాచ్‌లో దొర్లిన తప్పులు పునరావృతం కాకుండా ఆఖరి వరకు మైదానంలో నిలబడితే జట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. ఈమె ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులు చేసింది. జట్టు కష్టకాలంలో ఉన్నపుడు ఈమె పాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అదేవిధంగా అనుజా పాటిల్ సైతం సంతృప్తికరంగా పరుగులు రాబడుతున్నా ఆమెను టాప్ ఆర్డర్‌లో పంపేందుకు యాజమాన్యం సంశయం వ్యక్తం చేస్తోంది. ఇక జట్టులో సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి ఆస్ట్రేలియాతో జరిగిన గత మ్యాచ్‌లో టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో శిఖా పాండే, రుమేలీ ధర్ తమ బౌలింగ్ సామర్ధ్యాన్ని ఉపయోగించి ప్రత్యర్థిని కట్టడి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పూనమ్ యాదవ్, దీప్తి శర్మ వంటి స్పిన్నర్లు సైతం తమ పాత్రను సమర్థవంతంగా నెరవేర్చాల్సిన అవసరం కూడా ఉంది. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ స్పిన్ మాయాజాలం బాగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టులోని దీప్తి శర్మ, శిఖా పాండే తమ ఆటతీరులో కొత్తదనాన్ని చూపించడం ద్వారా ప్రత్యర్థి దూకుడును కట్టడి చేయాల్సిన బాధ్యతను చేపట్టాలి. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నటాలీ సివర్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణించడం వల్ల ప్రత్యర్థిని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన విషయాన్ని భారత మహిళా క్రికెటర్లు గమనంలోకి తీసుకోవాలి. ఆస్ట్రేలియాతో ఓడిపోయినా ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొని విజయం సాధిస్తే ఫైనల్‌లో పోరుకు చోటు దక్కేందుకు భారత్‌కు ఆస్కారం ఉంటుంది. లేదంటే మరో పరాజయం వారి ఖాతాలో జమ చేరడం ద్వారా మరింత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.