క్రీడాభూమి

బెంబేలెత్తిపోవడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 24: ఇటీవల దక్షిణాఫ్రికా టూర్‌లో జరిగిన రెండు సిరీస్‌లలో ఘన విజయం తర్వాత కొద్దిరోజుల కిందట ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, ఇపుడు జరుగుతున్న టీ-20 ముక్కోణపు సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన తామేమీ బెంబేలెత్తిపోవడం లేదని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. గత ఏడాది కాలంలో రెండు అంతర్జాతీయ సిరీస్‌లలో ఘన విజయం తర్వాత కొన్ని మ్యాచ్‌లలో పరాజయం పాలవడం వల్ల తామేమీ చింతించడం లేదని, తరచూ మ్యాచ్‌లు ఆడడంతో మరింత అనుభవం వస్తుందని ఆమె అభిప్రాయపడింది. ఇక్కడ జరుగున్న టీ-20 ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన తర్వాత ఆదివారం ఇంగ్లాండ్‌తో రెండో మ్యాచ్‌లో తలపడనున్న నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ వివిధ సిరీస్‌లు ఆడడం వల్ల తమలో క్రీడానుభవం మరింత పెరుగుతోందని, ఇదే తాము బీసీసీఐ నుంచి కోరుకుంటున్నామని పేర్కొంది. రెండు సిరీస్‌లు ఆడిన తర్వాత ఆరేడు నెలల విరామం వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నిలకడగా రాణించాలంటే కష్టసాధ్యమని ఆమె అభిప్రాయపడింది. తమ జట్టులో ప్రతిఒక్కరూ ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉన్నారని ఆమె పేర్కొంది. ఆటలో గెలుపు ఓటములు సహజమని, ఒక మ్యాచ్‌లో గెలిచి తర్వాత ఎదురయ్యే ఓటమిలో తప్పులు గురించి వెతుక్కోవడం సహజమని ఆమె పేర్కొంది.

చిత్రం..హర్మన్‌ప్రీత్ కౌర్