క్రీడాభూమి

లంకకు పాక్ వైట్‌వాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంబుల్లా, మార్చి 24: మహిళల క్రికెట్‌లో శ్రీలంకకు పాకిస్తాన్ వైట్‌వాష్ వేసింది. శనివారం జరిగిన చివరి, మూడో వనే్డలో పాకిస్తాన్ 108 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థిని 107 పరుగులకే ఆలౌట్ చేసి, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. మొదటి వనే్డను 69, రెండో వనే్డను 94 పరుగుల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్న పాకిస్తాన్ చివరి వనే్డలోనూ విజయాన్ని అందుకొని, లంకపై క్లీన్‌స్వీప్‌ను సాధించాలన్న పట్టుదలతో బరిలోకి దిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ఓపెనర్ నహిదా ఖాన్ 46 పరుగులతో రాణించగా, జవేరియా ఖాన్ 30, బిస్మా మరూఫ్ 26, సిద్రా అమీర్ 21, నిదా దార్ 20 చొప్పున పరుగులు చేశారు. లంక బౌలర్లలో అమా కాంచన 35 పరుగులకు రెండు, శశికళ సిరివర్దనే 40 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు.
చివరి మ్యాచ్‌లోనైనా గెలవడం ద్వారా ఊరట పొందుదామనుకున్న లంకకు ఆ అవకాశం లభించలేదు. బ్యాట్స్‌విమెన్ అంతా మూడుమ్మడిగా విఫలం కావడంతో ఆ జట్టు 41.3 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ నిపుణి హన్సిక 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతోపాటు సుగంధిక కుమారి (18 నాటౌట్), ప్రసాదని వీరకొడి (15), చామరి పొల్గాంపొలా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పాక్ బౌలర్లలో సనా మిర్ 27 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టింది. నష్రా సంధు 18 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించింది. నిదా దార్‌కు రెండు వికెట్లు లభించాయి.