క్రీడాభూమి

చరిత్రాత్మక మ్యాచ్‌కి కోహ్లీ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలో భారత్ జట్టు ఆడనున్న ఓ చరిత్రక మ్యాచ్‌కి దూరం కానున్నాడు. సౌతాఫ్రికా సిరీస్ తర్వాత భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన నిదహాస్ ట్రోఫీ ముక్కోణపు టీ-20 టోర్నమెంట్ నుంచి కోహ్లీ విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ మాసంలో ప్రారంభం కానున్న 11వ ఐపీఎల్‌లో బెంగుళూరు జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించనున్నాడు. కానీ, ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌తో జరిగే టెస్టులో ఆడడు. గత ఏడాది టెస్టు దాను దక్కించుకున్నప్పటికీ, ఆ జట్టు ఇంత వరకూ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. భారత్‌తో జరిగే మ్యాచ్‌తో అఫ్గాన్ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేస్తుంది. అయతే, ఇలాంటి ప్రాధాన్యత కలిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఆడడం లేదు. ఈ టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లాలి. దీనిని దృష్టిలో ఉంచుకొ కోహ్లీకి అఫ్గాన్‌తో టెస్టు నుంచి విరామాన్నిచ్చారు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఐదు టెస్టులు, మూడు వనే్డలు, మూడు టీ-20 మ్యాచ్‌లు అడనుంది. కాగా, ఈ సీరిస్‌లకు సిద్ధమయ్యేందుకు వీలుగా కోహ్లీ ముందుగానే ఇంగ్లాండ్ వెళతాడు. అక్కడ అతను సర్రే తరపున అడేందుకు ఒప్పందం కూడా కదుర్చుకున్నాడు. తన ప్రతిభను మరింత మెరుగు పరుచుకునేందుకై కోహ్లీ ఆ జట్టు తరపున ఆడనున్నట్లు తెలుస్తొంది. ఇలావుంటే, చతేశ్వర్ పుజారా యాక్‌షైర్‌తో చేసుకున్న ఒప్పందం పోడిగించుకునే అవకాశాలున్నాయ. అదే జరిగితే, సర్రే, యాక్‌షైర్ మధ్య జరిగే మ్యాచ్‌ల్లో కోహ్లీ, పూజారాలు ప్రత్యర్థులుగా తలపడతారు. కాగా, ఆఫ్గానిస్తాన్‌తో జరుగనున్న టెస్టులో కెప్టెన్సీ బాధ్యతలు ఎవ్వరికి అప్పగిస్తారన్నది ఇంకా ఖరారు కాలేదు.