క్రీడాభూమి

కరాచీకి మళ్లీ క్రికెట్ కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మార్చి 24: కరాచీకి మళ్లీ క్రికెట్ కళ వచ్చింది. అడుగడుగునా భద్రతా బలగాలు మోహరించినప్పటికీ, క్రికెట్ అభిమానులు ఆదివారం జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) లీగ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత కరాచీలో మళ్లీ క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో, నగరం మొత్తం సరికొత్త హంగులతో ముస్తాబైంది. ఇటీవలే ఆధునీకరించిన జాతీయ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ పెషావర్ జల్మీతో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు తలపడుతుంది. ఫలితంతో సంబంధం లేకుండా ఈ మ్యాచ్‌ని చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివస్తారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు ఆశిస్తున్నారు. ఇప్పటి వరకూ పీఎస్‌ఎల్ మ్యాచ్‌లన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోనే జరుగుతున్నాయి. ఈసారి గ్రూప్ దశ నుంచి సెమీ ఫైనల్స్ వరకూ అన్ని మ్యాచ్‌లకూ యుఏఈనే వేదికైంది. అయితే, ఫైనల్‌ను మాత్రం కరాచీలో నిర్వహించాలని పీసీబీ అధికారులు నిర్ణయించడంతో, తొమ్మిదేళ్ల విరామం తర్వాత క్రికెట్ ఇక్కడ కనువిందు చేయనుంది. చివరిసారిగా ఇక్కడ 2009 ఫిబ్రవరిలో పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య టెస్టు జరిగింది. ఆ సిరీస్‌లో భాగంగానే మార్చి 3న లాహోర్‌లో టెస్టుకు శ్రీలంక ఆటగాళ్లను గడాఫీ స్టేడియానికి తీసుకెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన సంఘటన అప్పట్లో సంచలనం రేపింది.
ఆతర్వాత ప్రపంచ దేశాలేవీ పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దేశంలో పరిస్థితి మెరుగుపడిందని, క్రికెటర్ల భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రుజువు చేయడానికి పీసీబీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం మాత్రం దాదాపుగా ఏమీ లేదనే చెప్పాలి. ఉగ్రవాదానికి ఊతమిస్తున్నదన్న కారణంగా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను భారత్ రద్దు చేసుకోవడంతో పీసీబీ భారీగా నష్టపోయింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సిరీస్‌లు ఆడాలని లేకపోతే పరిహారాన్ని చెల్లించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి క్రీడావివాదాల మధ్యవర్తిత్వ కోర్టు వరకూ అన్ని వేదికలపైనా పీసీబీ తన డిమాండ్‌ను వినిపించింది. అయితే, ఎక్కడా సానుకూల ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి తర్వాత, కెన్యా, జింబాబ్వే తప్ప పాకిస్తాన్‌లో మరే ఇతర జట్టు మ్యాచ్‌లు ఆడలేదు. పీసీబీ పదేపదే విజ్ఞప్తులు చేయడంతో, వరల్డ్ టీమ్‌ను ఐసీసీ పాకిస్తాన్‌కు పంపింది. ఆ జట్టు పాక్‌లో మ్యాచ్‌లు ఆడినప్పటికీ, పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా మారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వివిధ జట్లతో పాకిస్తాన్ జట్టు హోం సిరీస్‌లను యూఏఈలో అడుతున్నది. అదే విధంగా పీఎస్‌ఎల్‌లో విదేశీ క్రికెటర్లు కూడా ఉండడం, వారి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ టోర్నీని సైతం యూఏఈలోనే పీసీబీ ఆడిస్తున్నది. అయితే, స్వదేశంలో క్రికిట్ మ్యాచ్‌లు అత్యవసరమన్న కారణంగా గత ఏడాది ఫైనల్‌కు లాహోర్‌ను వేదికగా ఎంపిక చేసింది. ఈసారి కరాచీలో నిర్వహించడం ద్వారా, విదేశీ క్రికెటర్లకు పాక్‌లో ఎలాంటి సమస్య ఉండబోదన్న సందేశాన్ని ఇవ్వాలని పీసీబీ కృతనిశ్చయంతో ఉంది. ఇలావుంటే, విదేశీ జట్లు పాక్‌లో పర్యటించకపోవడం, పీఎస్‌ఎల్ మ్యాచ్‌లకు యూఏఈ వేదిక కావడం వంటి కారణాలతో కొంతకాలం కరాచీలో క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. ఆతర్వాత స్టేడియం ఆధునీకరణ పనులు మొదలయ్యాయి. ఇప్పుడు నిర్మాణ పనులన్నీ పూర్తికావడంతో, కొత్త రూపాన్ని సంతరించుకున్న జాతీయ స్టేడియంలో పీఎస్‌ఎల్ ఫైనల్‌ను నిర్వహించనున్నారు.
కాగా, ఫైనల్‌లో తలపడుతున్న ఇరు జట్లలోనూ కొంత మంది విదేశీ క్రీడాకారులు ఉన్నందున కరాచీలో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక స్టేడియం వద్ద పరిస్థితిని చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు 8,000 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. ఆదివారం నాటి పీఎస్‌ఎల్ ఫైనల్‌లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అణువణువును పరిశీలిస్తున్నారు. ఒకవైపు భారీ భద్రత కొనసాగుతుండగా, మరోవైపు అభిమానులు టికెట్ల కోసం స్టేడియానికి పరుగులు తీస్తున్నారు. క్రికెటర్లను ఆహ్వానించడానికి రోడ్లపై బారులు తీరుతున్నారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మొదటిసారి జరగనున్న క్రికెట్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనితోనైనా పీసీబీని అదృ ష్టం వరిస్తుందేమో చూడాలి.