క్రీడాభూమి

అసియా బిలియర్డ్స్ విజేత ఆద్వానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగాన్ (మయన్మార్), మార్చి 24: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ మరో టైటిల్‌ను సోంతం చేసుకున్నాడు. ఆసియా బిలియర్డ్స్ టోర్నమెంట్ ఫైనల్లో నిరుటి విజేత అద్వానీ 6-1 తేడాతో తన ప్రాక్టీస్ భాగస్వామి భాస్కర్‌పై విజయం సాధించి టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. గత ఏడాది బిలియర్డ్స్‌లో ప్రపంచ, ఆసియా చాంపియన్‌షిప్స్‌ను కైవసం చేసుకున్న అద్వానీ ఈ ఏడాది మరోసారి ఈ రెండు టైటిళ్లను నిలబెట్టుకొన్నాడు. ఇలావుంటే, ఆసియా మహిళల స్నూకర్ టైటిల్ కూడా భారత్‌కే లభించింది. అమీ కామని 3-0 స్కోరు తేడాతో థాయ్‌లాండ్ క్రీడాకారిణి సరిపరన్ సునత్‌కుమాజన్‌ను ఓడించి టైటిల్‌ను సోంతం చేసుకుంది. కాగా, కీరత్ భందాల్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. అంతకు ముందు జరిగిన సెమీస్‌లో కీరత్ 0-3 స్కోరు తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన క్రీడాకారిణి సిరిపరన్ సునత్‌కమాజన్ చేతిలో ఓటమిపాలైంది.