క్రీడాభూమి

జొకోవిచ్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీ బిస్కెన్, మార్చి 24: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో బై లభించిన ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌కు రెండో రౌండ్‌లో బెనొట్ పైర్ షాకిచ్చాడు. జొకోవిచ్ ఆటను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులను అతని ఏ దశలోనూ పుంజుకోకపోవడంతో నిరాశ చెందారు. పైర్ 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో జొకోవిచ్‌ను చిత్తుచేసి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. గతంలో ఆరు పర్యాయాలు ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జొకోవిచ్ ఈసారి తాను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే నిష్క్రనించడం విచిత్రం. చేతి గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేదని, అందుకే, గతంలో మాదిరి బలమైన సర్వీసులు, అద్భుతమైన షాట్లతో రాణించలేకపోతున్నాడని పరిశీలకులు అంటున్నారు.
ఇలావుంటే, మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో క్వాలిఫయర్ నటాలియా విక్యంట్సెవాను 7-5, 6-4 తేడాతో ఓడించిన వీనస్ విలియమ్స్ మూడో రౌండ్ చేరింది. తన సోదరి, ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ మొదటి రౌండ్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ, వీనస్ ఎలాంటి తడబాటు లేకుండా ముందంజ వేసింది. మూడో రౌండ్‌లో ఆమె నెదర్లాండ్స్‌కు చెందిన కికీ బెర్టెన్స్‌ను ఢీ కొంటుంది. మరో రెండు రౌండ్ మ్యాచ్‌లో బెర్టెన్స్ 5-7, 7-6, 6-1 తేడాతో వర్వరా లెప్‌చెన్కొపై విజయం సాధించింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న ప్రపంచ మాజీ నంబవన్ వన్ కరోలిన్ వొజ్నియాకి పోరాటం ముగిసింది. మోనికా పగ్ ఆమెను 0-6, 6-4, 6-4 తేడాతో ఓడించింది.