క్రీడాభూమి

సాహా విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: భారత టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇక్కడ జరిగిన ఒక అంతర్ క్లబ్ టోర్నీలో కేవలం 20 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచనం సృష్టించాడు. వచ్చే నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌కు సన్నాహక టోర్నమెంట్‌గా నిర్వహిస్తున్న ఈ పోటీలో మోహన్ బగాన్ తరఫున ఆడుతున్న సాహా బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేస్ (బీఎన్‌ఆర్)పై 20 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మీడియం పేసర్ అమాన్ ప్రసాద్ వేసిన ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి అతను సెంచరీని పూర్తిచేయడం విశేషం. ఆ ఓవర్‌లో ఒక వైడ్ కూడా వేసిన అమాన్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తమీద సాహా స్కోరులో 14 సిక్సర్లు, నాలుగు బౌండరీలు ఉన్నాయి.

చిత్రం..వృద్ధిమాన్ సాహా