క్రీడాభూమి

మొదటి మ్యాచ్‌కి లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 7: ముంబయిలో ఈనెల 9న జరగాల్సిన తాజా ఐపిఎల్ సీజన్ తొలి మ్యాచ్‌కి లైన్ క్లియరైంది. ఈ మ్యాచ్‌ని నిర్వహించుకోవడానికి ముంబయి కోర్టు అంగీకరించింది. అయితే, మహారాష్టల్రో నెలకొన్న నీటి ఎద్దడి, ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసును 12వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ప్రస్తుతానికి సమస్యకు తెరపడినప్పటికీ, తీర్పు ఏ విధంగా ఉంటుందోనని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఆందోళన చెందుతున్నది. మహారాష్టల్రో నీటి కొరత తీవ్రంగా ఉన్న కారణంగా, ఐపిఎల్ మ్యాచ్‌ల కోసం సుమారు 60 లక్షల లీటర్ల నీటిని వాడడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందని, కాబట్టి, మహారాష్టల్రో జరగాల్సిన ఐపిఎల్ మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాల్సిందిగా బిసిసిఐని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ జరుపుతోంది.
ప్రజలు చస్తున్నా పట్టదా?
ఒకవైపు నీరులేక ప్రజలు చస్తున్నా పట్టదా? అంటూ ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ)పై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకంటే ఐపిఎల్ ముఖ్యమా అంటూ బుధవారం వ్యాఖ్యానించిన కోర్టు గురువారం వాదోపవాదాల సమయంలో మరింత తీవ్రంగా స్పందించింది. మహారాష్టల్రో జరగాల్సిన మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరిలించాలన్న పిటిషన్ చాలా ఆలస్యంగా దాఖలైందని పేర్కొంది. అప్పటికే ప్రారంభోత్సవంతోపాటు, 9న ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ మధ్య మ్యాచ్‌కి సర్వం సిద్ధమైందని గుర్తుచేసింది. అందుకే తొలి మ్యాచ్‌ని మరో ప్రాంతానికి తరలించాలని ఆదేశించడం లేదని పేర్కొంది. కేసును 12కు వాయిదా వేసింది.