క్రీడాభూమి

మన్‌ప్రీత్ వచ్చేశాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపో (మలేసియా), ఏప్రిల్ 9: స్టార్ ఫార్వర్డ్ మన్‌దీప్ సింగ్ చేరికతో అజ్లన్ షా హాకీ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న భారత జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. తండ్రి హఠాన్మరణంతో స్వస్థలానికి వెళ్లిన మన్‌ప్రీత్ అక్కడ కార్యక్రమాలను ముగించుకొని తిరిగి వచ్చాడు. ఈటోర్నీ మొదటి మ్యాచ్‌లో జపాన్‌ను ఎదుర్కొని 2-1 తేడాతో గెలిచిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 1-5 తేడాతో చిత్తయింది. ఆదివారం నాటి మ్యాచ్‌లో కెనడాను ఢీ కొంటుంది. ఆదివారం జరిగే ఇతర మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జపాన్ జట్లు తలపడతాయి. కాగా, శనివారం జపాన్‌ను కెనడా 3-1 ఆధిక్యంతో ఓడించింది. మరో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ 5-3 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మలేసియాను ఆస్ట్రేలియా 5-1 తేడాతో చిత్తుచేసింది.
చాలాకాలంగా భారత జట్టులో నిలకడగా రాణిస్తున్న మన్‌ప్రీత్ సింగ్ ఈటోర్నీలో రాణిస్తాడని అభిమానులు ఆశించారు. జట్టు సభ్యులతో కలిసి ఇపో చేరుకున్న అతను జపాన్‌తో మొదటి మ్యాచ్ జరగడానికి ముందే తండ్రి మరణించాడన్న సమాచారం రావడంతో స్వస్థలానికి వెళ్లాడు. అక్కడ కార్యక్రమాలను ముగించుకొని, శనివారం మళ్లీ ఇపో చేరుకున్నాడు. అతను ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. అతను లేకుండా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ తడబడింది. జపాన్ వంటి ఒక సాధారణమైన జట్టును ఓడించడానికి నానా తంటాలు పడింది. ఆస్ట్రేలియాకు ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాలు జట్టులో మన్‌ప్రీత్ ఎలాంటి కీలక పాత్రను పోషిస్తున్నాడో స్పష్టం చేశాయి. పెనాల్టీను సృష్టించుకోవడం, వాటిని గోల్స్‌గా మలచుకోవడంలో జట్టులోని యువ ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని కోచ్ రోలాంట్ ఆల్ట్‌మన్స్ వాపోతున్నాడు. మన్‌ప్రీత్ చేరికతో జట్టు పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కెనడాతో మ్యాచ్‌కి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.