క్రైమ్/లీగల్

భారత నకిలీ జర్నలిస్టుల అరెస్టు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, మార్చి 29: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ బ్రిస్‌బేన్ ఎయిర్‌పోర్టులో ఎనిమిది మంది నకిలీ భారత జర్నలిస్టులు పట్టుబడ్డారు. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి జరిగే కామనె్వల్త్ గేమ్స్‌లో కవరేజీ నిమిత్తం వెళ్లిన వారంతా ఇక్కడి ఎయిర్‌పోర్టులో దిగారు. ఈ ఎనిమిది మంది బృందం సభ్యులు తప్పుడు మీడియా అక్రిడిటేషన్‌లతోపాటు మోసపూరిత ధ్రువపత్రాలు కలిగి ఉన్నారని ‘ది గార్డియన్’ పత్రిక పేర్కొంది. ఈ ఎనిమిది మందిని ప్రశ్నించగా, వారిలో 46 ఏళ్ల రాకేష్ కుమార్ అనే వ్యక్తి మనుషుల అక్రమ రవాణాతోపాటు నకిలీ ధ్రువపత్రాలు కలిగి ఉన్నందుకు అతనిని ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ (ఏబీఎఫ్) అరెస్టు చేసి, కస్టడీకి తరలించినట్టు ఆ పత్రిక తెలిపింది.