క్రీడాభూమి

నేమార్‌కు గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఏప్రిల్ 9: స్టార్ ఆటగాడు నేమార్ అవసరం తమకు ఉందని, అందుకే అతనిని అందుబాటులో ఉంచాలని బ్రెజిల్ చేసిన విజ్ఞప్తికి బార్సిలోనా సానుకూలంగా స్పందించింది. కోపా అమెరికా కాంటెనారియో, రియో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాలు లేవన్న వార్తలు వెలుడ్డాయి. దీనిపై బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య స్పందిస్తూ నేమార్ అవసరం తమకు ఉందని, అందుకే అతనిని అందుబాటులో ఉంచాలని బార్సిలోనాకు లేఖ రాసింది. దీనిపై చర్చించిన తర్వాత నేమార్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ తీర్మానాన్ని ఆమోదించామని బార్సిలోనా చైర్మన్ జొసెప్ మారియా బర్టోలొమూ ఒక ప్రకటనలో తెలిపాడు. కోపా అమెరికా, ఒలింపిక్స్‌లో నేమార్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు.