క్రీడాభూమి

24 నుంచి లంకలో భారత్, పాక్ సిరీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: చాలాకాలంగా ఎదురుచూస్తున్న భారత్, పాక్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఈనెల 24 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, భారత విదేశంగ మంత్రి సుష్మా స్వరాజ్ పర్యటనలో ఈ అంశం చర్చకు రానుంది. పాకిస్తాన్ పర్యటనలో భాగంగా ఆమె ముందు ఈ ప్రతిపాదన వస్తుంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిసిన ఆమె అధికారిక చర్చ మొదలైన తర్వాత పలు అంశాలను ప్రస్తావనకు వస్తాయి. భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కూడా వాటిలో ఒకటి. 2014లో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ, అక్కడ భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయన్న అనుమానాలు ఉండడంతో, అక్కడికి వెళ్లేందుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిరాకరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ప్రతిపాదించినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో మ్యాచ్‌లను ఆడేందుకు కూడా ససేమిరా అంది. దీనితో శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చాయి. ఈ ప్రతిపాదనకు పాక్ సర్కారు ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి బిసిసిఐకి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ప్రస్తుతం ఈ అంశం విదేశాంగ శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. సుష్మా స్వరాజ్ పాక్ పర్యటనలో ఉన్నందున, అక్కడ పాక్ అధికారులు క్రికెట్ సిరీస్‌ను ఆమోదించాల్సిందిగా కోరడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆమె లాంఛనంగా అనుమతి తెలిపితే, ఈనెల 24 నుంచి సిరీస్ మొదలవుతుంది. జనవరి 5వ తేదీ నాటికి ముగుస్తుంది.
భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు జనవరి ఆరు లేదా ఏడున బయలుదేరాలి. అదే విధంగా న్యూజిలాండ్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌కు పాకిస్తాన్ జనవరి 7న బయలుదేరుతుంది. అందుకే ఐదో తేదీన భారత్, పాక్ సిరీస్‌ను ముగించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.