క్రీడాభూమి

మలేసియా ఓపెన్ బాడ్మింటన్ సైనా నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షా ఆలం (మలేసియా), ఏప్రిల్ 9: మలేసియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్, ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఆమె ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జూ ఇంగ్ (చైనీస్ తైపీ) చేతిలో 19-21, 13-21 తేడాతో ఓటమిపాలైంది. స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్, ఇండియా సూపర్ సిరీస్ టోర్నీల్లోనూ సెమీ ఫైనల్స్ నుంచి వెనుదిరిగిన సైనా మరోసారి అదే రీతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. తై జూ ఇంగ్‌తో గత నెల ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ఆడిన సైనా ఓడింది. మొత్తం మీద ప్పటి వరకూ ఇదే ప్రత్యర్థితో మొత్తం 12 పర్యాయాలు ఢీకొన్న ఆమె ఏడోసారి ఓటమిని చవిచూసింది. కాగా, సైనా పరాజయంతో ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. ఈనెల సింగపూర్ సిటీలో జరిగే సింగపూర్ ఓపెన్‌లో సైనా తలపడుతుంది.
మరో సెమీ ఫైనల్‌లో నాలుగో సీడ్ రచనొక్ ఇంతనాన్ 21-11, 21-19 ఆధిక్యంతో ఆరో ర్యాంక్ క్రీడాకారిణి వాంగ్ ఇహాన్‌పై గెలిచి, తై జూ ఇంగ్‌తో టైటిల్ పోరును ఖరారు చేసుకుంది.
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మొదటి రెండు ర్యాంక్‌ల్లో కొనసాగుతున్న చెన్ లాంగ్, లీ చాంగ్ వెయ్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మొదటి సెమీ ఫైనల్‌లో లీ చాంగ్ వెయ్ 21-7, 21-14 ఆధిక్యంతో జాన్ ఒ జొర్జెనె్సన్‌పై విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. మరో సెమీ ఫైనల్‌లో చెన్ లాంగ్ 9-21, 21-19, 21-14 ఆధిక్యంతో క్రిస్టీ జొనాథన్‌ను ఓడించాడు. మహిళల డబుల్స్ విభాగంలో జంగ్ య్యున్ ఎన్/ షిన్ సీయింగ్ చాన్‌జోడీతోపాటు, యూ యాంగ్/ టాంగ్ యుయాంటింగ్ జోడీ కూడా ఫైనల్‌లో స్థానం సంపాదించింది. అదే విధంగా పురుషుల డబల్స్‌లో చాన్ బియావో/ హాంగ్ వెయ్ జోడీ, కిమ్ సారాంగ్/ కిమ్ జి జంగ్ జోడీ తమతమ ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌లోకి అడుగుపెట్టాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో పెంగ్ సూన్ చాన్/ లియో ఇంగ్ గో జోడీ, టంటోవీ అహ్మద్, లిలియానా నాట్సిర్ జోడీ సైతం తమతమ ప్రత్యర్థులపై గెలుపొంది ఫైనల్‌లో స్థానం సంపాదించాయి.
ఇలావుంటే, తాను సర్వశక్తులు ఒడ్డి పోరాటం సాగించానని సైనా తెలిపింది. అయతే, ప్రత్యర్థి తన కంటే మెరుగైన ఆటతో రాణించిందని ప్రశంసించింది. వరుసగా మూడు టోర్నీల్లోనూ సెమీ ఫైనల్స్‌లో నే ఓడిపోవడానికి ప్రత్యేక కారణాలంటూ ఏవీ లేవని స్పష్టం చేసింది. రానున్న టోర్నీల్లో ఎలాంటి పొ రపాట్లు లేకుండా ఆడతానని టైటిల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.